ఖిలావరంగల్, మార్చి 23 : ది ఇనిస్టిట్యూట్ ఆఫ్ చార్టెడ్ అకౌంటెట్స్ ఆఫ్ ఇండియా (ICAI), న్యూ ఢిల్లీలోని నాన్ స్టాండింగ్ (మెంబర్స్ ఇన్ ప్రాక్టీస్) కమిటీకి 2026-27 సంవత్సరానికి కోఆప్టెడ్ సభ్యుడిగా వరంగల్‌కు చెందిన చార్టర్డ్ అకౌంటెంట్ త్రిపురనేని గోపీచంద్‌ను నియమించారు. ఈ నియామకాన్ని ఆ సంస్థ ప్రస్తుత అధ్యక్షుడు సీఏ ప్రసన్న కుమార్ ఆమోదించారు. ఈ విషయాన్ని న్యూ ఢిల్లీ ప్రధాన కార్యాలయం నుంచి అదివారం రాత్రి మెయిల్ ద్వారా తెలియజేసినట్లు సీఏ గోపీచంద్ తెలిపారు.
జాతీయ స్థాయి కమిటీలో సభ్యత్వం దక్కడం పట్ల ఆయన ఆనందం వ్యక్తం చేశారు. తన నియామకానికి సహకరించిన ICAI అధ్యక్షుడు సీఏ ప్రసన్న కుమార్‌కు, సెంట్రల్ కౌన్సిల్ సభ్యులు ముప్పాల శ్రీధర్, దయా నివాస్ శర్మలకు, అలాగే వరంగల్ ప్రాంత సీఏలందరికి, దక్షిణ భారత ప్రాంతీయ సభ్యులకు గోపీచంద్ కృతజ్ఞతలు తెలిపారు. తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకునేలా బాధ్యతలను కష్టపడి నిర్వహిస్తానని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు.