న్యూశాయంపేట, డిసెంబర్ 5: సమాజంలో వేల్పుల వేణుగోపాల్ చేస్తున్న సామాజిక సేవలు అభినందనీయమని కార్పొరేటర్ మామిండ్ల రాజు అన్నారు. వరంగల్ జిల్లా న్యూ శాయంపేటలో ప్రజాసేవ సమితి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ జిల్లా నాయకుడు, బెస్ట్ సిటిజన్ అవార్డు గ్రహీత వేల్పుల వేణుగోపాల్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. రెడ్ క్రాస్ సంస్థ ఆధ్వర్యంలో మేఘ రక్తదాన శిబిరం నిర్వహించారు. సుజిత్ నగర్ పేదలకు అన్నదానం చేశారు.
ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ..సమాజ సేవ చేసేందుకు నిరంతరం తపించే వ్యక్తి వేణుగోపాల్ అన్నారు. వేణుగోపాల్ ఆయురా రోగ్యాలతో ఉండాలని దేవుడిని కోరుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, గుండు సదానందం వేల్పుల సందీప్, నిఖిల్, వినయ్, శ్యామ్ పాల్గొన్నారు.