INDW vs AUSW | ఆస్ట్రేలియా గడ్డపై గర్జించిన భారత్.. మంధాన, శ్రేయాంక జోరుతో పొట్టి సిరీస్ కైవసం..!
INDW vs AUSW : ఆస్ట్రేలియాను వారి సొంతగడ్డపై ఓడించడం ఏ జట్టుకైనా సవాలే. ప్రపంచంలోనే మేటి జట్టైన ఆసీస్‌ను భారత మహిళల జట్టు చిత్తుగా ఓడించింది. అడిలైడ్‌లో 17 పరుగులతో గెలిచి పొట్టి సిరీస్ కైవసం చేసుకుంది.
INDW vs AUSW : ఆస్ట్రేలియాను వారి సొంతగడ్డపై ఓడించడం ఏ జట్టుకైనా సవాలే. ప్రపంచంలోనే మేటి జట్టైన ఆసీస్‌ను భారత మహిళల జట్టు చిత్తుగా ఓడించింది. అడిలైడ్‌లో 17 పరుగులతో గెలిచి పొట్టి సిరీస్ కైవసం చేసుకుంది. నిర్ణయాత్మక మ్యాచ్‌లో స్మృతి మంధాన(82), జెమీమా రోడ్రిగ్స్(59)ల విధ్వసంతో ఆసీస్‌కు సవాల్ విసిరిన టీమిండియాకు ఆతిథ్య జట్టు బదులివ్వలేకపోయింది. అష్లే గార్డ్నర్ (57) అర్ద శతకంతో రాణించినా శ్రేయాంక పాటిల్(3-22) వికెట్ల వేటతో దెబ్బతీసింది. ఫలితంగా భారీ ఛేదనలో 159కే పరిమితమైన కంగారూ టీమ్ సిరీస్ కోల్పోయింది.
వన్డే వరల్డ్‌కప్ ఛాంపియన్‌గా విదేశీ పర్యటనలో తొలి సీరస్ గెలుపొందింది భారత జట్టు. ఆస్ట్రేలియా పర్యటనను విజయంతో ఆరంభించిన భారత జట్టు టీ20 సిరీస్‌లో పంజా విసిరింది. తొలి పోరులోనే ఆసీస్‌కు షాకిచ్చిన టీమిండియా.. రెండో మ్యాచ్‌ను చేజేతులా వదిలేసింది. అయితే.. నిర్ణయాత్మక మూడో గేమ్‌లో హర్మన్‌ప్రీత్ కౌర్ సేన ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టింది. ఓపెనర్ స్మృతి మంధాన(82) అంతర్జాతీయ క్రికెట్లో 70వ అర్ధ శతకంతో.. జెమీమా రోడ్రిగ్స్(59) విధ్వంసంతో ఆతిథ్య జట్టు బౌలర్లు నీరుగారిపోయారు.
Smiles all-around in Adelaide 🥳#TeamIndia register a commanding win by 1⃣7⃣ runs ✌️
With that, they clinch the #AUSvIND T20I series 2⃣-1⃣ 🏆
Scorecard ▶️ https://t.co/8PDW83zavH pic.twitter.com/CTN9QjU0Vx
— BCCI Women (@BCCIWomen) February 21, 2026
భారీ ఛేదనలో ఆస్ట్రేలియాను శ్రేయాంక పాటిల్(౦3-22) ఆదిలోనే దెబ్బకొట్టింది. గత మ్యాచ్‌లో చెలరేగిన జార్జియా వోల్(10) ను తను ఔట్ చేయగా ఫొబే లిచ్‌ఫీల్డ్(26)ను శ్రీ చరణి వెనక్కి పంపింది. అష్లీ గార్డ్నర్(57) హాఫ్ సెంచరీతో పోరాడినా శ్రీచరణి(3-32), అరుంధతి రెడ్డి(2-35)లు వికెట్ల వేటతో ఒత్తిడి పెంచారు. ఆఖర్లో అనాబెల్ సథర్లాండ్(14)ను వెనక్కి పంపిన చరణి ఆసీస్ ఓటమిని పరిపూర్ణం చేసింది. ఆస్ట్రేలియా గడ్డపై భారత జట్టుకు ఇది రెండో టీ20 సిరీస్ విజయం. మెరుపు అర్ధ శతకంతో టీమిండియా గెలుపులో కీలకమైన మంధాన ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా ఎంపికైంది.
సెంచరీ భాగస్వామ్యంతో..
తొలుత కంగారూ బౌలర్లకు ఓపెనర్ స్మృతి మంధాన(82), జెమీమా రోడ్రిగ్స్(59) చుక్కలు చూపించారు. 19 పరుగులకే షఫాలీ వర్మ(7)ను ఔట్ చేసిన ఆసీస్ బౌలర్ల ఆనందాన్ని ఆవిరి చేస్తూ మంధాన, జెమీమా క్రీజులో పాతుకుపోయారు. మంధాన బౌండరీలతో చెలరేగగా.. జెమీమా క్లాస్ ఇన్నింగ్స్‌తో అలరించింగింది.
Authoritative and match-winning 🫡#TeamIndia Vice-captain Smriti Mandhana is the Player of the Match in the 3️⃣rd T20I for her glorious 8⃣2⃣(55) 👏
Scorecard ▶️ https://t.co/8PDW83zavH#AUSvIND | @mandhana_smriti pic.twitter.com/XvPqQYL8Gg
— BCCI Women (@BCCIWomen) February 21, 2026
అనుభవజ్ఞులైన ఈ ఇద్దరూ ఆసీస్ బౌలర్లకు ఏమాత్రం అవకాశమివ్వకుండా స్కోర్‌బోర్డును ఉరికించారు. రెండో వికెట్‌కు సెంచరీ (121 పరుగులు) భాగస్వామ్యంతో భారీ స్కోర్‌కు బాటలు వేశారు. మంధాన ఔటయ్యాక బ్యాటింగ్ ఆర్డర్లో ముందొచ్చిన రీచా ఘాష్(18) తన స్టయిల్ ఆటతో రెచ్చిపోగా భారత్ 6 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CJP | ఢిల్లీ నిరసనలు.. అభిజిత్ దీప్కే సహా ముగ్గురి ముందస్తు అరెస్ట్..!
Sudoku | ప్రపంచ సుడోకు వేదికపై సత్తా చాటేందుకు సిద్ధమైన తండ్రీకొడుకులు..!
Road accident | కారు, బైక్‌ను ఢీకొట్టిన లారీ.. పలువురికి తీవ్ర గాయాలు
Elimination | బిగ్‌బాస్ తెలుగు 10లో షాకింగ్ ఎలిమినేషన్.. హౌస్ నుంచి అపూర్వ అవుట్, తర్వాత శాలిని వంతేనా?
Srisailam | నేటి నుంచి శ్రీశైలంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

