Hanumakonda DEO | హనుమకొండ చౌరస్తా, డిసెంబర్ 11: హనుమకొండ డీఈవోగా ఎల్ వెంకటగిరిరాజ్ గౌడ్ గురువారం బాధ్యతలు స్వీకరించారు. మొదట ఆయన భద్రకాళి అమ్మవారిని దర్శించుకుని తర్వాత హనుమకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్‌ను కలిసి వారి ఆదేశాల మేరకు బాధ్యతలు స్వీకరించారు.
విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్ హనుమకొండ డీఈవోగా సూర్యాపేట డీఈవో ఆఫీస్‌లో ఎఫ్ఏవోగా పనిచేస్తున్న ఎల్వీ గిరిరాజ్గౌడ్ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేయగా.. జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ అడిషనల్ కలెక్టర్ వైవీ గణేష్ ఇంఛార్జి డీఈవోగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేయడంతో గందరగోళ పరిస్థితి నెలకొంది. దీంతో గురువారం వెంకటగిరిరాజ్గౌడ్ కలెక్టర్‌ను కలిసి వారి ఆదేశాల మేరకు బాధ్యతలు చేపట్టారు.
ఈ సందర్భంగా బాధ్యతలు స్వీకరించిన ఆయనను సమగ్ర శిక్ష కార్యాలయ కోఆర్డినేటర్లు బి.మహేష్, బి.మన్మోహన్, బి.సుదర్శన్‌రెడ్డి, ఎస్.సునీత, కె.రఘుచంద్రరావు, ఏ.సదానందం, ఈ.భువనేశ్వరి, జిల్లా విద్యాశాఖ కార్యాలయ సిబ్బంది, ప్రధానోపాధ్యాయ సంఘం సభ్యులు, ఇతర ఉపాధ్యాయ సంఘాల సభ్యులు పుష్పగుచ్చాలు అందజేసి స్వాగతం పలికారు.
e-cigarette: పార్లమెంట్లో ఈ-సిగరేట్ తాగిన టీఎంసీ ఎంపీ.. బీజేపీ ఆరోపణలు
Fire Accident | మంచిర్యాలలో ఇంటిపై అగ్నిప్రమాదం.. భారీగా ఆస్తి నష్టం
Panchayat Polling | ముగిసిన తొలి విడుత పోలింగ్.. కొద్దిసేపట్లో మొదలుకానున్న కౌంటింగ్