Vanamahotsavam | హనుమకొండ చౌరస్తా, జూన్ 28: వనమహోత్సవం సందర్భంగా హనుమకొండలోని ఆర్ట్స్ కాలేజీలో ప్రాంగణంలో ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణకు మొక్కలే ఆధారమని ఆరోగ్యవంతమైన భవిష్యత్తుకు పచ్చదనం అత్యవసరమన్నారు. అనంతరం కళాశాల భవనాన్ని కలియతిరిగి పరిశీలించారు.
కాలేజీలో రోడ్డు, మరుగుదొడ్లు, సెమినార్ హాల్ పునరుద్ధణ పలు అంశాలను ప్రిన్సిపాల్ జ్యోతి ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. ఈ మేరకు పనులన్నిటికి అంచనాలు వేసి నివేదికలు పంపించాలని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అధ్యాపకులు, విద్యార్థులు ఉన్నారు.