హనుమకొండ (ఐనవోలు) : ఐనవోలు మల్లికార్జునస్వామి దేవాలయంలో ఉగాది పర్వదినాన్ని వైభవంగా నిర్వహించారు. భక్తులు పెద్దసంఖ్యలో స్వామివారిని దర్శించుకొని పూజలు నిర్వహించారు. స్వామి వారి మేల్కొలుపు తర్వాత విశేష అభిషేకాలు జరిగాయి. ఆలయ ఉప ప్రధాన అర్చకుడు పాతర్లపాటి రవీందర్ ఆధ్వర్యంలో ఆలయా ముఖ్య అర్చకులు ఐనవోలు మధుకర్ శర్మ, ఈవో అద్దంకి నాగేశ్వర్ రావు వసంత దంపతుల చేతుల మీదుగా నూతన పంచాంగాన్ని ఆవిష్కరించిన అనంతరం పంచాంగ పఠనం చేశారు.
కాలం విశేషాలను వెల్లడించారు. కాలం వరాహం వాహనం మీద వచ్చింది. వర్షాలు సమృద్ధిగా కురువను న్నుట్లగా ఆయన తెలిపారు. ఆదాయ, వ్యయాలను లెక్కించారు. ఉగాది పర్వదినం పురస్కరించుకొని చాలా మంది భక్తులు పెద్ద సంఖ్యలో మల్లికార్జునస్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించుకున్నారు. ఉగాది పురస్కరించుకొని భక్తులకు స్వామి అతి శ్రీఘ్ర (దగ్గరి) దర్శనం సౌకర్యం కల్పించినట్లుగా ఈవో తెలిపారు.