
హన్మకొండ: వరంగల్‌ను హైదరాబాద్ మహానగరం తరహాలో అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, శ్రీనివాస్ గౌడ్ అన్నారు. వరంగల్‌లోని జేఎన్ఎస్ స్టేడియంలో జరుగుతున్న సింథటిక్ ట్రాక్ పనులను మంత్రులు పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ.. జిల్లాలోని ప్రతి నియోజకవర్గానికి ఒక స్టేడియం నిర్మిస్తామని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు చెప్పారు. సీఎం కేసీఆర్ పాలనలో తెలంగాణ అన్నిరంగాల్లో పురోగతి సాధిస్తున్నదని తెలిపారు. టీఆర్ఎస్ ప్రభుత్వం వరంగల్‌ను సమగ్రంగా అభివృద్ధి చేస్తున్నదని చెప్పారు.
తెలంగాణ క్రీడాకారులు అంతర్జాతీయ స్థాయిలో పతకాలను గెలుస్తున్నారని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. సీఎం కేసీఆర్ కృషివల్లే రామప్ప దేవాలయానికి యునెస్కో గుర్తింపు దక్కిందని చెప్పారు. గత ప్రభుత్వాలు క్రీడలను పట్టించుకోలేదని విమర్శించారు. మంత్రి కేటీఆర్ వరంగల్ నగరాన్ని ఐటీ హబ్‌గా తీర్చి దిద్దుతున్నారని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ అన్నారు. జేఎన్ఎస్ స్టేడియంలో అన్ని మౌలిక సదుపాయాలను కల్పించామని చెప్పారు.