Shakambaridevi | హనుమకొండ చౌరస్తా, సెప్టెంబర్ 27 : చారిత్రక వేయిస్తంభాల రుద్రేశ్వరాలయంలో రుద్రేశ్వరీదేవిని శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా 6వ రోజు భవానీదేవిగా అలకరించారు. ప్రముఖ ఆధ్యాత్మికురాలు, ఉపాధ్యాయురాలు బొమ్మిరెడ్డిపెల్లి గాయత్రిదేవి, కృష్ణవేణి అందించిన 21 రకాల కూరగాయలతో అమ్మవారిని శాకాంబరీదేవిగా అలంకరించి, గారెలు, 5 రకాల తీపిపదార్థాలు, నైవేద్యం సమర్పించినట్లు ప్రధానార్చకుడు గంగు ఉపేంద్ర శర్మ తెలిపారు.
గణపతి నవగ్రహ సుదర్శన మహాచండీయాగం ఆగమశాస్త్ర ప్రకారంగా హోమాధి కార్యక్రమాలు నిర్వర్తించారు. చిత్తూరు జిల్లా నుంచి వచ్చిన భక్తులకు, వేలాది మందికి సీఎంఆర్ షాపింగ్‌మాల్ ప్రసాద వితరణ చేశారు. సాయంకాలం కుండె అరుణ, రాజ్‌కుమార్ శిష్యబృందంచే కూచిపూడి నృత్యాలు నిర్వర్తించారు. సేవా సమితి సభ్యులు మాడిశెట్టి రాజ్‌కుమార్, కోన శ్రీకర్, రవీందర్‌రెడ్డి, సతీష్-దివ్య దంపతులు సేవలందించారు.
ఆలయ కార్యనిర్వాహణాధికారి డి అనిల్‌కుమార్ భక్తులకు సేవలందించారు. వైదిక కార్యక్రమాలను ఆలయ ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ నిర్వహించారు.
Karepally : ‘వ్యవసాయానికి సబ్సిడీల తగ్గింపులో భాగమే యూరియా కొరత’
Kothagudem Urban : లంబాడీల ఆత్మగౌరవ సభను జయప్రదం చేయాలి : గుగులోతు రాజేశ్ నాయక్
ACB | లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడిన ఎల్లంపేట టౌన్‌ప్లానింగ్ అధికారి రాధాకృష్ణా రెడ్డి