హనుమకొండ చౌరస్తా, ఫిబ్రవరి 4 : హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మూడురోజులుగా వరంగల్ కేంద్రంగా జరుగుతున్న మహిళల టీ-20 క్రికెట్ పోటీల్లో వరంగల్ జట్టు నిజామాబాద్‌పై 102 పరుగుల తేడాతో గెలిచి మూడో విజయం సాధించింది. దీంతో పూల్-బి విభాగంలో అగ్రస్థానంలో నిలిచిందని, రెండో స్థానంలో నిలిచిన ఖమ్మం జట్టు సెమీఫైనల్ చేరిందని వరంగల్ డిస్ట్రిక్ క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి చాగంటి శ్రీనివాస్ తెలిపారు.
మరో వైపు పూల్-ఏ విభాగంలో మహబూబ్‌నగర్ అగ్రస్థానంలో ఉండగా, ఆదిలాబాద్ జట్టు రెండో స్థానంలో నిలిచి సెమీఫైనల్ అర్హత పొందిందన్నారు. ఈనెల 6న సెమీఫైనల్లో వరంగల్ జట్టు ఆదిలాబాద్‌తో తలపడుతుంది. మహబూబ్‌నగర్ జట్టు ఖమ్మంతో ఎదుర్కొంటుందన్నారు. గెలిచిన తుది జట్లు 7న జరిగే ఫైనల్లో పాల్గొంటాయని శ్రీనివాస్ తెలిపారు. నిజామాబాద్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో వరంగల్‌కు చెందిన బ్యాటర్ మోహనశ్రీ 87 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచి వరంగల్ జట్టును సెమీస్‌కు చేర్చింది.

