అమరావతి : చంద్రబాబు ( Chandrababu ) పాలనలో అన్ని వర్షాలు నష్టపోతున్నాయని, ముఖ్యమంగా రైతులకు ఆయన పాలన హానికరమని వైసీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ( YS Jagan ) విమర్శించారు. బుధవారం తూర్పు గోదావరి జిల్లా దేవరపల్లిలో పొగాకు యార్డులో రైతులను పరామర్శించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. 27 నెలల కూటమి పాలనలో రైతులకు గిట్టుబాటు ధర లేదని , రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆరోపించారు.
కనీసం రైతు కుటుంబాలను పరామర్శించడం లేదని విమర్శించారు. వైసీపీ హయాంలో పొగాకు ధర రూ.289 ఉండగా నేడు రూ.236 మాత్రమే వస్తుందని పేర్కొన్నారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తరువాత సున్నా వడ్డీ పథకాన్ని రద్దు చేశారని, రైతు భరోసా సాయంలో కోతలు పెట్టారని వెల్లడించారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత రైతులను ఆదుకుంటామని హామీ ఇచ్చారు.
Andhra Pradesh,