ప్రజాస్వామ్యంలో ఓటే కీలకం : పులి రజినీకాంత్ ముదిరాజ్
ప్రజాస్వామ్యంలో ఓటే కీలకం అని బీఆర్ఎస్ పార్టీ వరంగల్ పశ్చిమ నియోజకవర్గ కో-ఆర్డినేటర్ పులి రజినీకాంత్ ముదిరాజ్ అన్నారు.
హనుమకొండ చౌరస్తా, ఆగస్టు 11 : ప్రజాస్వామ్యంలో ఓటే కీలకం అని బీఆర్ఎస్ పార్టీ వరంగల్ పశ్చిమ నియోజకవర్గ కో-ఆర్డినేటర్ పులి రజినీకాంత్ ముదిరాజ్ అన్నారు. తెలంగాణ ఎన్నికల కమిషన్ నిర్వహించిన ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా విధులు నిర్వర్తించిన బీఎల్వోలు, పార్టీ నియమించిన బీఎల్ఏలను మంగళవారం హనుమకొండ మచిలీబజార్లోని కార్యాలయంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా బీఎల్వోలకు, బీఎల్ఏలకు శాలువాలతో సత్కరించి, చిరు కానుకలు అందజేశారు. అనంతరం పులి రజినీకాంత్ మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ఓటే కీలకమని, తెలంగాణ ఎన్నికల కమిషన్ నిర్వహించిన స్పెషల్ ఇంటెన్సీవ్ రివిజన్లో విధులు నిర్వర్తించి ప్రజల ఓటు మ్యాపింగ్, ఎన్యుమరేషన్ ఫామ్స్ పూర్తి చేయడం, డిజిటలైజేషన్ వంటి ప్రక్రియలో బీఎల్వోలు, బీఎల్ఏలు ఎంతో కృషి చేశారని కొనియాడారు.
పౌరులు విధిగా వారి ఓటును నమోదు చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో బీఎల్వోలు సుష్మ, చంద్ర, నవ్య, రాజశ్రీ, నస్రిన్, అశోక్, నజుమా, కవిత, సంతోష, అస్మా, సరస్వతి, విజయ, రాజు, కుమార్, బీఆర్ఎస్ పార్టీ బీఎల్ఏలు రఘు, స్రవంతి, వరుణ్, శ్యామ్, హరికృష్ణ, సుమిత్ర, నందకిషోర్, రామకృష్ణ పాల్గొన్నారు.
Read Today's Latest Warangal-rural Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dhruv Rathee | 2018 నాటి కేసులో యూట్యూబర్ ధృవ్రాఠీకి అరెస్ట్ వారెంట్ జారీ.. బీజేపీపై వీడియో చేసిన కేసులో
‘పారిశ్రామికవాడ సారపాకలో మౌలిక సదుపాయాలు కల్పించాలి’
Traffic Jam | దసరా, బతుకమ్మ పండుగల ఎఫెక్ట్.. పంతంగి టోల్ఫ్లాజా వద్ద వాహనాల రద్దీ చూశారా..?
DMK | సీఈసీని వెంటనే తొలగించాలి.. డీఎంకే తీర్మానం..!
Moderate Rains | రేపు, ఎల్లుండి తెలంగాణలో మోస్తరు వర్షాలు : వాతావరణ శాఖ
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

