హనుమకొండ చౌరస్తా, ఫిబ్రవరి 4: హనుమకొండ ప్రభుత్వ వృత్తివిద్య జూనియర్ కాలేజీ జాతీయ సేవా పథకం ఎన్.ఎస్.ఎస్ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు తెలంగాణ సామాజిక న్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని కాలేజీ ప్రాంగణంలో తెలంగాణ సామాజిక న్యాయ దినోత్సవ ప్రతిజ్ఞ చేశారు. ముఖ్యఅతిథిగా రీజినల్ డైరెక్టర్ ఆఫ్ ఇంటర్మీడియెట్ ఎడ్యుకేషన్ వరంగల్ హనుమకొండ జిల్లా ఇంటర్ విద్యాధికారి ఏ.గోపాల్ హాజరై విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ర్ట ప్రభుత్వ ఆదేశాల మేరకు అన్ని ప్రభుత్వ కళాశాలలో తెలంగాణ సామాజిక న్యాయ ప్రతిజ్ఞ దినోత్సవాన్ని చేపట్టడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా ఎలాంటి వివక్ష లేకుండా ప్రతి వ్యక్తిని గౌరవిస్తానని, అందరికి సమానత్వం, న్యాయం, గౌరవం కోసం నిలబడతానని, అన్యాయాన్ని ఎప్పుడు సమర్థించనని, వెనుకబడిన వారి కోసం నా గలాన్ని వినిపిస్తానని ప్రతిజ్ఞ చేయించారు. కాలేజీ ఇన్చార్జి ప్రిన్సిపాల్ వి.రాజశేఖర్ రెడ్డి, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారులు సవాసి శ్రీనివాస్, ఆర్.ప్రవీణ్ కుమార్, అధ్యాపకులు విద్యార్థులు పాల్గొన్నారు.