హనుమకొండ(ఐనవోలు): ఐనవోలు మల్లికార్జునస్వామి దేవస్థానం దినదిన ప్రవర్ధమానం చెందుతోంది. అతి పురాతనమైన చాలా పవిత్రమైన చరిత్ర కలిగిన ఆలయం. ఈ ఆలయానికి భక్తుల తాకిడి రోజు రోజుకు పెరుగుతుంది అనడానికి సాక్షమే ఈ సమకూరిన ఆదాయం. 37 రోజులకు గాను 23 హుండీలను తెరిచి లెక్కించగా రూ. 6 లక్షల 7 వేల, 555 రూపాయలు వచ్చింది. వివిధ రకాల టిక్కెట్ల ద్వారా వచ్చిన ఆదాయం రూ.25 లక్షల 81 వేల 944 రూపాయలు సమకూరిందని ఆలయ ఈవో అద్దంకి నాగేశ్వర్ రావు వెల్లడించారు.
హుండీ, టిక్కెట్ల ద్వారా దేవాలయానికి వచ్చిన మొత్తం ఆదాయం రూ.31 లక్షల 89 వేల 499 రూపాయలు వచ్చింది. ఈ లెక్కింపునకు పరిశీలకులుగా డి అనిల్ కుమార్, ఈవో అద్దంకి నాగేశ్వర్ రావు, హెడ్ కానిస్టేబుల్ టి సుదర్శన్ రెడ్డి, కానిస్టేబుల్ జి పరమేశ్వరి, శ్రీ లక్ష్మి వేంకటేశ్వర సేవాసమితి మహబూబాబాద్, అర్చకులు, సిబ్బంది కిరణ్, కన్నయ్య, రాజు తదితరులు పాల్గొన్నారు.