హనుమకొండ చౌరస్తా, ఏప్రిల్ 7: గత మార్చి ఎసెస్సీ స్పాట్ మూల్యాంకనం, కులగణన విధులు నిర్వహించిన టీచర్లకు వెంటనే పారితోషికం చెల్లించాలని మంగళవారం హనుమకొండ ఫాతిమానగర్‌లోని ఎసెస్సీ మూల్యాంకన స్పాట్ కేంద్రం వద్ద భోజన విరామ సమయంలో టీటీజాక్-యూఎస్పీసీ-జేఏసీటీవో ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన చేపట్టారు. ఈ సందర్భంగా టీటీజాక్ ఛైర్మన్ పి.దామోదర్‌రెడ్డి, యూఎస్పీసీ సీహెచ్.రవి, జేఏసీటీవో ఛైర్మన్ సదానందగౌడ్ మాట్లాడుతూ 10వ తరగతి మూల్యాంకన విధులకు చెల్లించే పారితోషికం గత 7 సంవత్సరాలుగా పెంచలేదని, ఇంటర్ స్పాట్ రేట్లు రెండుసార్లు పెంచారన్నారు.
ఎసెస్సీ స్పాట్ రేట్లు కనీసం 50 శాతం పెంచాలని అలాగే ఈ సంవత్సరం స్పాట్ విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయులకు మూల్యాంకనం పూర్తి కాగానే ఆలస్యం చేయకుండా వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వివిధ ఉపాధ్యాయ సంఘాల బాధ్యులు ఎం.తిరుపతిరెడ్డి, సీహెచ్.రవీందర్‌రాజు, కె.రాంబాబు, ఈ.రవీందర్‌రెడ్డి, పి.శ్రీహరి, ఎన్.మహేందర్, బి.రాజీబాపురావు, రామకృష్ణ, బద్దం సుదర్శన్‌రెడ్డి, శ్రీనివాసులు, బి. శ్రీరామాంజనేయులు, అలీ, వి.నరేందర్‌రెడ్డి, డి.బిక్షపతి, ఎం.సతీష్‌రెడ్డి, గోవిందరావు, దేవేందర్‌రాజు, టి.కుమార్, ఎండి.ఆఫ్టర్, జి.శ్రీనివాస్‌నాయక్, సి.సుజన్ప్రసాద్, అనిత, శోభారాణి, జ్యోత్స్న, వసుంధర, కే.నాగరాజు, వి.రాంబాబు, సీహెచ్.శ్రీనివాస్‌రెడ్డి, డి.మాలకొండారెడ్డి, వీరప్రతాప్, ఎం.మధుకర్‌రెడ్డి, పీటర్, జి.విజయ్‌కుమార్, ఎం.శ్రీనివాస్, ఏ.సదాశివరెడ్డి, అనురాధ, శ్రీవాణి, చంద్రారెడ్డి, రావుఫ్, శ్రీనివాస్, మంగ రాజన్న పాల్గొన్నారు. అనంతరం జిల్లా విద్యాశాఖ అధికారి ఎల్వీ గిరిరాజుగౌడ్కి వినతి పత్రం అందజేశారు.