హైదరాబాద్, ఆగస్టు 12 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ సచివాలయ ఉద్యోగుల సహకార పరపతి సొసైటీ తమ సభ్యుల కుటుంబాలకు ఆర్థిక భరోసాపై కీలక నిర్ణయం తీసుకున్నట్టు సొసైటీ అధ్యక్షుడు రేండ్ల రాజేశ్ తెలిపారు. బుధవారం ఆయన ప్రకటన విడుదల చేశారు.
ఈ నెల 15న స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా సొసైటీ సభ్యులకు రూ.15 లక్షల జీవిత బీమా(లోన్ ఇన్సూరెన్స్) పథకాన్ని అందుబాటులోకి తీసుకువస్తున్నట్టు వెల్లడించారు. సచివాలయం, శాసనసభ(అసెంబ్లీ), లోక్‌భవన్ కార్యాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు విజయవంతంగా అమలు చేస్తున్నామని రాజేశ్ పేర్కొన్నారు.