అవినీతి నిర్మూలనకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలి : సుంకరి జ్యోతి
సమాజంలో అవినీతిని నిర్మూలించేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతాయు తంగా వ్యవహరించాలని, నిజాయితీ, నైతిక విలువలు, పారదర్శకతను తమ జీవితంలో భాగంగా చేసుకో వాలని కాకతీయ విశ్వవిద్యాలయం ఆర్ట్స్‌కాలేజీ ప్రిన్సిపాల్ ఆచార్య సుంకరి జ్యోతి పిలుపునిచ్చారు. Sunkari Jyoti,Corruption,Hanumakonda,Arts college
హనుమకొండ చౌరస్తా, అక్టోబర్ 26 : సమాజంలో అవినీతిని నిర్మూలించేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతాయు తంగా వ్యవహరించాలని, నిజాయితీ, నైతిక విలువలు, పారదర్శకతను తమ జీవితంలో భాగంగా చేసుకో వాలని కాకతీయ విశ్వవిద్యాలయం ఆర్ట్స్‌కాలేజీ ప్రిన్సిపాల్ ఆచార్య సుంకరి జ్యోతి పిలుపునిచ్చారు. అవినీతి రహిత సమాజ నిర్మాణం ప్రతి పౌరుడి బాధ్యత అని, ఈ దిశగా విద్యార్థులు, అధ్యాపకులు, ఉద్యోగులు చిత్తశుద్ధితో కృషి చేయాలని ఆమె పేర్కొన్నారు.
అక్టోబర్ 26 నుంచి నవంబర్ 1వ తేదీ వరకు నిర్వహించనున్న అవినీతి నిర్మూలన అవగాహన వారోత్సవాల్లో భాగంగా సోమవారం కాలేజీలో విద్యార్థులు, అధ్యాపకులు, సిబ్బందిచే అవినీతి వ్యతిరేక ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ జ్యోతి మాట్లాడుతూ అవినీతి వల్ల సమాజ అభివృద్ధికి ఆటంకం కలగడమే కాకుండా, ప్రజాస్వామ్య వ్యవస్థలపై ప్రజలకు ఉన్న విశ్వాసం దెబ్బతింటుందని, ప్రతి ఒక్కరూ తమ విధులను నిజాయితీగా నిర్వహిస్తూ, అవినీతికి దూరంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ ఎస్.ఎన్.రెహమాన్, అధ్యాపకులు, విద్యార్థులు, కళాశాల సిబ్బంది పాల్గొన్నారు.
Read Today's Latest Warangal-rural Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?

