హనుమకొండ చౌరస్తా ఫిబ్రవరి 18: హనుమకొండ జిల్లా హసన్ పర్తి మండలంలోని అనంతసాగర్లో గల సుమతి మహిళా ఇంజినీరింగ్ కళాశాలకు(Sumati Reddy Women’s College) యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ (UGC) జవహర్ లాల్ నెహ్రు టెక్నాలాజికల్ యూనివర్సిటీ హైద్రాబాద్ (JNTUH) నుంచి స్వయం ప్రతిపత్తి హోదా (Autonomous status) వచ్చినట్లు ఎస్సార్ విద్యాసంస్థల చైర్మన్ ఎనగందుల వరదారెడ్డి తెలిపారు. మంగళవారం హనుమకొండ కాకాజీ కాలనీలో ఎస్సార్ కాలేజీలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు.
దేశంలోని ముఖ్య నగరాలలో గల కళాశాలలకు ధీటుగా సుమతి రెడ్డి కళాశాల విద్యార్థినులు కావాల్సిన మెలుకువలు నేర్పించి, వివిధ రంగాల్లో రాణించేందుకు దోహదం చేస్తుందన్నారు. దేశ విదేశాలలో గల వివిధ MNC కంపనీలలో సుమతి రెడ్డి కళాశాల విద్యార్థినులు ఉద్యోగాలు చేస్తున్నారని, ప్రపంచంలో గల వివిధ దేశాలలోగల కంపనీలకు అవసరమైన నైపుణ్యాలను కలిగి, ప్రతిష్టాత్మక సంస్థలలో పనిచేయుటకు సిద్ధంగా ఉందన్నారు. స్వయం ప్రతిపత్తి హోదా కళాశాల అభ్యున్నతికి దోహదపడుతాయన్నారు.