హనుమకొండ చౌరస్తా, జూన్ 30 : వరంగల్ జిల్లా వెయిట్‌లిఫ్టింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అక్టోబర్‌లో రాష్ట్రస్థాయి వెయిట్‌లిఫ్టింగ్ పోటీలు వర్ధన్నపేటలో నిర్వహించనున్నట్లు అసోసియేషన్ అధ్యక్షుడు కేఆర్ దివ్యజరాజ్ తెలిపారు. సోమవారం హనుమకొండ ప్రెస్‌క్లబ్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ వరంగల్ క్రీడాకారులకు నాణ్యమైన తర్ఫీదుతో పాటు రాష్ట్ర, జాతీయస్థాయిలో పాల్గొనే క్రీడాకారులకు ఆర్థిక సహాయసహాకారాలు అందజేస్తారన్నారు.
క్రీడాకారులకు క్రీడా సామగ్రి, క్రీడా దుస్తులు అందజేయనున్నట్లు, అత్యుత్తమ ప్రతిభ కలిగిన క్రీడాకారులకు పారితోషికం అందజేయనున్నట్లు తెలిపారు. అక్టోబర్‌లో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో వరంగల్‌లో నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆమె తెలిపారు. ఈ సమావేశంలో కార్యదర్శులు శ్రీపాద శ్రీనివాసరావు, ఉపాధ్యక్షుడు యెడ్ల సురేందర్, డాక్టర్ మేలే శిరీష్మ పాల్గొన్నారు.