హనుమకొండ, సెప్టెంబర్ 18 : శ్రీహనుమద్గిరి పద్మాక్షి దేవాలయంలో ఈనెల 22 నుంచి అక్టోబర్ 4 వరకు పద్మాక్షి దేవి శరన్నవరాత్రి మహోత్సవాలు నిర్వహిస్తున్నామని ఆలయ వేదపండితులు నాగిళ్ల షణ్ముఖ పద్మనాభ తెలిపారు. గురువారం హనుమకొండ ప్రెస్‌క్లబ్‌లో వారు కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గుట్టపై కూడా రోడ్డు సౌకర్యం ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
అలాగే భక్తుల సౌకర్యార్థం మంచినీటి వసతి పార్కింగ్ ఏర్పాట్లు, విద్యుత్తు దీపాలంకరణ సాంస్కృతిక కార్యక్రమాలు బతుకమ్మ నిమజ్జనోత్సవం, తిప్పోత్సవం కార్యక్రమాలను నిర్వహించబడుతున్నట్లు చెప్పారు. ప్రతిరోజు అమ్మవారికి అభిషేకం, ప్రత్యేక అలంకరణ, పూజలు, చండీహవనం ప్రతిరోజు నిర్వహించనున్నట్లు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి సేవలో తరించగలరని తెలిపారు. ఈ సమావేశంలో సేవా సమితి సభ్యులు కనుకుంట్ల రవికుమార్, నీలారపు రాజకుమార్, పోలు లక్ష్మణ్ పాల్గొన్నారు.