హనుమకొండ చౌరస్తా, ఫిబ్రవరి 7: హనుమకొండలోని భారతీ విద్యాభవన్ హైస్కూల్లో స్పెక్టమ్-2026 ఘనంగా నిర్వహించారు. సైన్స్, మ్యాథ్స్, సోషల్ స్టడీస్, తెలుగు, హిందీ, ఇంగ్లీష్ సబ్జెక్టుల్లో వివిధ రకాల ఎగ్జిబిట్స్, వర్కింగ్ మోడల్స్‌ను నర్సరీ నుంచి పదో తరగతి విద్యార్థుల వరకు పాల్గొని వివిధ అంశాలకు సంబంధించిన ఎగ్జిబిట్స్ను ప్రదర్శించారు.
మ్యాథ్స్ రౌండప్, వాటర్ ట్యాంక్ అలారం, కిడ్నీస్ వర్కింగ్ మోడల్, సస్టేయినబుల్ అగ్రికల్చర్ ఎకో ఫ్రెండ్లీ యూరియా, అమ్మోనియా, పురాన గ్రంథాల్లోని సంఖ్య సంబంధిత పదాలు, గ్రామీణ క్రీడా వినోదాలు, ప్రివెన్షన్ ఆఫ్ యాక్సిడెంట్స్ ఇన్ హిల్ ఏరియాస్, రిసైక్లింగ్ రేయిన్ వాటర్ ఫర్ అవర్ డెయిలీ యూజ్, ఫైథాగరస్ థీరమ్, మోడల్ ఆఫ్ డీఎన్ఏ, బ్లడ్ గ్రూపింగ్, థర్మల్ పవర్ ప్లాంట్, రివర్ క్లీనింగ్ రోబో వంటి వివిధ ఎగ్జిబిట్స్ను ప్రదర్శించి అందరినీ ఆకట్టుకున్నారు. ఈ స్పెక్టమ్-2026లో పాల్గొన్న విద్యార్థులందరికీ ప్రశంసాపత్రాలు అందజేసి అభినందించారు.