కరీమాబాద్ : దేశంలోనే తెలంగాణ పోలీస్‌కు ప్రత్యేక గుర్తింపు ఉందని 4వ బెటాలియన్ ఇంచార్జి కమాండెంట్ ఆర్ వెంకటయ్య అన్నారు. బోర్డర్ సెక్యూరటీ ఫోర్స్ అకాడమీ ఆధ్వర్యంలో మధ్యప్రదేశ్‌లో ప్రత్యేక శిక్షణ పొందిన కానిస్టేబుల్ ధన్‌రాజ్‌కు మామునూరులోని బెటాలియన్‌లో సర్టిఫికెట్‌ను అందజేశారు. ఈ సందర్భంగా కమాండెంట్ వెంకటయ్య మాట్లాడుతూ దేశం మొత్తంలోనే శిక్షణ విషయంలో 4వ బెటాలియన్ ముందుందన్నారు.
తెలంగాణ పోలీస్ గౌరవం పెంచేలా బెటాలియన్ కృషి చేస్తున్నదనిపేర్కొన్నారు. శిక్షణ పూర్తి చేసుకున్న కానిస్టేబుల్ ధన్‌రాజ్‌ను ఈ సందర్భంగా ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో ఆర్ఐలు కిరణ్‌కుమార్, రవిందర్, ఆర్ఎస్ఐలు నందకిషోర్, అశోక్ తదితరులు పాల్గొన్నారు.