భీమదేవరపల్లి, ఫిబ్రవరి 11: కోరిన కోరికలు తీర్చే కొత్తకొండ వీరభద్ర స్వామి దేవస్థానంలో బుధవారం హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే, ముల్కనూరు సహకార గ్రామీణ పరపతి సంఘం అధ్యక్షులు అలిగిరెడ్డి ప్రవీణ్ రెడ్డి సతీసమేతంగా హాజరై ప్రత్యేక పూజలు చేశారు. ప్రవీణ్ రెడ్డి ఆయన సతీమణి రాజ్యలక్ష్మి, మనవడు క్రితిన్ తో కలిసి ఆలయ ప్రదక్షిణలు చేసి గుమ్మడికాయ, కోడె మొక్కులు చెల్లించుకున్నారు. గండా దీపం వద్ద నూనె పోశారు. ఉపాలయాల్లోని అష్టభుజ లక్ష్మీగణపతి, హనుమాన్, నాగేంద్రస్వామి కి పూజలు చేశారు.
ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మొగిలిపాలెం రాంబాబు, తాటికొండ వినయ్, గుడ్ల శ్రీకాంత్, నందనం సందీప్, తాటికొండ రమేష్, శరత్ చంద్ర, శివకుమార్ శేష వస్త్రం కప్పి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆయన వెంట నాయకులు పిడిశెట్టి కనకయ్య, గుర్రాల భాస్కర్ రెడ్డి, కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు.