Thousand Pillar Temple | వేయిస్తంభాల గుడిలో ఘనంగా సీతారాముల కళ్యాణోత్సవం
చారిత్రిక రుద్రేశ్వరస్వామి వేయిస్తంభాల దేవాలయంలో శ్రీసీతారాముల కళ్యాణ బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి.
హనుమకొండ చౌరస్తా, మార్చి 27: చారిత్రిక రుద్రేశ్వరస్వామి వేయిస్తంభాల దేవాలయంలో శ్రీసీతారాముల కళ్యాణ బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. త్రేతా యుగంలో చైత్రశుద్ధ నవమి గురువారం పునర్వసు నక్షత్రం కర్కాటక లగ్నంలో శ్రీరాముడు జన్మించాడని పురాణాలు పేర్కొంటున్నాయి శ్రీరాముడు అభిజిత్ ముహూర్తంలో అంటే మధ్యాహ్నం సుమారు 12 గంటల సమయంలో జన్మించాడు ఇన్ని తిథులు ఉండగా రాముడు నవమి నాడే ఎందుకు జన్మించారు అని ఎవరికో సందేహం కలిగింది 9 సంఖ్య పరమాత్మను సూచిస్తుంది.
ఈ సంఖ్యను ఏ అంకెతో హెచ్చించిన మళ్లీ తొమ్మిదే వస్తుంది ఎన్ని రూపాలలో ఉన్న ఎన్ని అవతారాలు ఎత్తిన ఎన్ని పేర్లు పెట్టిన అసలు తత్వం ఒక్కటే అన్న రహస్యాన్ని ప్రపంచానికి వెల్లడించటానికి స్వామి ఆ రోజున జన్మించాడని చెబుతారు. అలాగే అప్పటి కాలానికి విరుద్ధంగా శ్రీరాముడు జీవితాంతం ఏకపత్ని వ్రతుడిగా చరిత్రలో నిలిచిపోయాడు. సీతను కేవలం భార్యగానే కాకుండా కష్టసుఖాలలో పాలుపంచుకునే అర్ధాంగిగా గౌరవించాడు. ఆదర్శవంతమైన దాంపత్యానికి సీతారాములు మారుపేరుగా నిలిచారు సీతారామ కళ్యాణం లోక జీవన హేతుకం. ప్రతి ఏటా శ్రీరామనవమి రోజున భక్తి శ్రద్ధలతో రామ కళ్యాణం నిర్వహిస్తారు.
శుక్రవారం సీతా రామచంద్ర స్వామి వార్లకు మంగళ వాయిద్యాల మధ్య వేదమంత్రాలతో స్వామివార్లకు మంగళ స్నానాలు ఆచరింపజేసి కళ్యాణ వేదికపై కళ్యాణమూర్తులను ప్రతిష్టించి విశ్వక్సేన పూజ స్వస్తి వాచకం నిర్వర్తించి యాగశాలలో నవగ్రహ మహా సుదర్శన హోమం నిర్వర్తించి పూర్ణాహుతి నిర్వర్తించి కళ్యాణ క్రతువును ప్రారంభించారు. ప్రముఖ ఆధ్యాత్మికవేత్తలైన ఎస్ రవీంద్రనాథ్ అనురాధ దంపతులు ప్రముఖ న్యాయవాది కర్రె రవీంద్రనాథ్, శ్రీరాముల అనిల్ కుమార్ ఉభయ దాతలుగా వ్యవహరించారు.
పాదప్రక్షాళన మంగళసూత్ర ధారణ పుష్పార్చన మహిళలచే మంగళహారతులు వడపప్పు బెల్లం పానకం నివేదన సమర్పించడం జరిగినది. ఈ దృశ్యాన్ని తిలకించిన భక్తజనం పులకించిపోయారు.
రాష్ర్ట ప్రభుత్వం పక్షాన వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి పట్టు వస్త్రాలు సమర్పించారు. వేలాది మంది భక్తులకు అన్న ప్రసాద వితరణ చేశారు. వైదిక కార్యక్రమాలను కృష్ణ సాయి శర్మ, మణికంఠ శర్మ అవధాని, ఆలయ ప్రధాన అర్చకులు గంగు ఉపేందర్ శర్మ ఆలయ కార్య నిర్వహణ అధికారి డి.అనిల్ కుమార్ ఆలయ సిబ్బంది మధుకర్,రామకృష్ణ, రజిత చేపట్టారు. ఈ కార్యక్రమంలో పులి రజినీకాంత్,చొల్లేటి కృష్ణమాచారి,తదితరులు పాల్గొన్నారు. టీటీడీ వారి సౌజన్యంతో భజనా కార్యక్రమాలు నిర్వహించారు.
Read Today's Latest Warangal-rural Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Masoud Pezeshkian | మేం అణ్వాయుధాల కోసం ప్రయత్నిస్తున్నామనేది పచ్చి అబద్ధం : ఇరాన్ అధ్యక్షుడు
Chittem Rammohan Reddy | రైతు భరోసా అందని రైతుకు భరోసా ఎవరు..?.. కాంగ్రెస్ సర్కారుపై మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి నిప్పులు
Oil Price | మళ్లీ పెరిగిన ముడిచమురు ధరలు.. బ్రెంట్ క్రూడ్ ధర ఎంతంటే..!
KTR | నేను ట్రీట్మెంట్ చేయిస్తా.. బ్రెయిన్ క్యాన్సర్‌తో బాధపడుతున్న వినయ్‌కు కేటీఆర్ భరోసా.. వీడియో
Katie Zacharia: వైట్‌హౌజ్ ప్రెస్ సెక్రటరీగా 5 రోజులే.. జాబ్ వదిలేసిన కేట్ జచారియా
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

