నైనీలో బొగ్గు అధికోత్పత్తికి చర్యలు: సింగరేణి
ఒడిశాలోని నైనీ బొగ్గు బ్లాక్ నుంచి ఈ ఏడాదికి నిర్దేశించిన లక్ష్యాల మేర బొగ్గు అధికోత్పత్తి సాధించేందుకు అన్ని రకాల చర్యలు తీసుకోవాలని అధికారులను సింగరేణి సీఎండీ డాక్టర్ బుద్ధ ప్రకాష్ జ్యోతి ఆదేశించారు.
హైదరాబాద్, నవంబర్ 7 (నమస్తే తెలంగాణ): ఒడిశాలోని నైనీ బొగ్గు బ్లాక్ నుంచి ఈ ఏడాదికి నిర్దేశించిన లక్ష్యాల మేర బొగ్గు అధికోత్పత్తి సాధించేందుకు అన్ని రకాల చర్యలు తీసుకోవాలని అధికారులను సింగరేణి సీఎండీ డాక్టర్ బుద్ధ ప్రకాష్ జ్యోతి ఆదేశించారు. శనివారం నైనీ గని సంస్థ డైరెక్టర్లు, జనరల్ మేనేజర్లతో ఏర్పాటు చేసిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ.. ఎల్ నినో నేపథ్యంలో రాష్ట్ర విద్యుత్తు అవసరాల కోసం నైనీ గని నుంచి రోజుకు కనీసం 20వేల టన్నులకు పైగా బొగ్గు సరఫరా చేయాలని, బొగ్గు ఉత్పత్తి, రవాణాకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు.
సీఎస్ఆర్ సేవలు భేష్
సీఎస్ఆర్లో భాగంగా సింగరేణి చేపడుతున్న కార్యక్రమాలకు ప్రశంసలు లభించాయి. కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు చెందిన ఐఐసీఏ, కోల్ ఇండియా లిమిటెడ్ ఇటీవల కోల్కతాలో సంయుక్తంగా ఓ సదస్సును నిర్వహించాయి. ఇందులో సింగరేణి తరఫున హైదరాబాద్ కార్యాలయ డీజీఎం నిమ్మ భాసర్, సీనియర్ పర్సనల్ ఆఫీసర్ గౌస్ పాషా పాల్గొన్నారు.
ఈ క్రమంలోనే రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం, జస్టిస్ ఆన్ వీల్స్, ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు అల్పాహార పంపిణీ, తాగునీటి ప్రాజెక్టులు, నిరుద్యోగ యువతకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ వంటి సింగరేణి వినూత్న కార్యక్రమాలను భాసర్ వివరించారు. దీనికి కోల్ ఇండియా, ఇతర అనుబంధ సంస్థల ప్రతినిధుల నుంచి విశేష ప్రశంసలు దక్కాయి. ఇదిలావుంటే ఇందిరా గాంధీ జాతీయ సార్వత్రిక విశ్వవిద్యాలయం (ఇగ్నో) నుంచి సీఎస్ఆర్ విభాగంలో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా పూర్తిచేసిన భాసర్ను సింగరేణి సీఎండీ బుద్ధప్రకాశ్ జ్యోతి శనివారం ప్రత్యేకంగా అభినందించి, ఘనంగా సన్మానించారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

