భూగర్భ జలం.. గగనం
గ్రేటర్ లో భూగర్భ జలాలు ప్రమాదకర స్థాయిలో పడిపోతున్నాయి. . హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాల్లోని పలుచోట్ల 40 మీటర్ల కంటే దిగువకు భూగర్భ జలాలు పడిపోవడం పరిస్థితి తీవ్రతకు అద్దంపడుతున్నది.
-
గ్రేటర్లో 12.59 మీటర్ల దిగువకు
-
సిటీలో నెల వ్యవధిలోనే 1.01 మీటర్ కిందికి
-
గతేడాది కంటే 6.85 మీటర్లు పడిపోయిన జలాలు
-
కూకట్పల్లి, శంకర్పల్లి, మేడిపల్లిలో 20 మీ. దిగువకు
-
బోర్లు ఎండిపోయి అవస్థలు పడుతున్న ప్రజలు
సిటీబ్యూరో, నవంబర్ 7 (నమస్తే తెలంగాణ):గ్రేటర్ లో భూగర్భ జలాలు ప్రమాదకర స్థాయిలో పడిపోతున్నాయి. . హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాల్లోని పలుచోట్ల 40 మీటర్ల కంటే దిగువకు భూగర్భ జలాలు పడిపోవడం పరిస్థితి తీవ్రతకు అద్దంపడుతున్నది. అక్టోబర్ నెల పూర్తయ్యేసరికే భూగర్భ జలాల క్షీణత వేసవి కంటే ఎక్కువగా ఉంది. బోర్లు ఎండిపోయి, భూగర్భ జలాలు పడిపోయి, జలమండలి నీళ్లు సక్రమంగా సరఫరా కాకపోవడంతో జన జీవనం అస్తవ్యస్తమవుతున్నది. ఇండ్లలోని బోర్లు ఇప్పుడే పూర్తిగా వట్టిపోతుంటే.. రానున్న రోజుల్లో పరిస్థితులు ఎలా ఉంటుదోనని నగర ప్రజలు కలవరపాటుకు గురవుతున్నారు.
గ్రేటర్ హైదరాబాద్‌లో భూగర్భ జలాలు అత్యంత దారుణంగా పడిపోతున్నాయి. అక్టోబర్ నెలాఖరు వరకు గ్రేటర్‌లోని హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాల్లో సగటున 12.59 మీటర్ల దిగువకు చేరుకున్నాయి. కేవలం ఒక్క నెలలోనే 1.01 మీటర్ల కిందికి భూగర్భ జలాలు పడిపోవడం ఆందోళన కలిగించే అంశం. గతేడాదితో పోలిస్తే కోర్ అర్బన్ ప్రాంతాల్లో భూగర్భ జలమట్టం సుమారు 6.85 మీటర్ల దిగువకు పడిపోయింది. నగరంలో దాదాపు 96 శాతం మంది భూర్భ జలాలపై ఆధారపడటంతో ఈ పరిస్థితి ఏర్పడినట్లు నిపుణులు చెబుతున్నారు. కూకట్పల్లి మండలంలో అత్యధికంగా 22.88 మీటర్ల కిందికి భూగర్భ జలాలు పడిపోయాయి. శంకర్పల్లి మండలంలో 21.81 మీటర్లు, మేడిపల్లిలో 20.31 మీటర్లు కిందికి చేరుకున్నాయి. అక్టోబర్ నెలాఖరు వరకే పరిస్థితి ఇలా ఉంటే వేసవిలో గ్రేటర్ ప్రాంతాలు ఎడారిని తలపించే ప్రమాదముంది.నీటి వృథాను అరికట్టి ప్రత్యామ్నాయ ఏర్పాట్లను అమలు చేయకుంటే తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
కూకట్పల్లి గ్రామంలో పాతాళానికి..
క్షేత్రస్థాయిలో ఆయా ప్రాంతాల్లో భూగర్భ జలాలు ఎంత మేర ఉన్నాయని పరిశీలిస్తే విస్తుపోయే పరిస్థితులు కనిపిస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో అత్యంత ప్రమాదకరంగా భూగర్భ జలాలు పాతాళానికి చేరుకున్నాయి. ఆయా ప్రాంతాల్లో కరువు తాండవిస్తున్నది. బోర్లన్నీ ఎండిపోయి జలమండలి, ప్రైవేట్ ట్యాంకర్లపైనే పూర్తిస్థాయిలో ఆధారపడాల్సిన దుస్థితి ఏర్పడింది. కూకట్పల్లి రెవెన్యూ గ్రామంలో అత్యధికంగా 48.35 మీటర్ల కిందికి పడిపోయాయి. ఆ తర్వాతి స్థానాల్లో కుత్బుల్లాపూర్‌లో 37.63 మీటర్లు, కేపీహెచ్బీలో 34.94 మీటర్లు, హయత్‌నగర్‌లో 29.16 మీటర్లు, చెంగిచర్లలో 28.41 మీటర్లు, బహదూర్‌గూడలో 27.71 మీటర్లు ఫతుల్లాగూడలో 27.26 మీటర్లు, శేరిలింగంపల్లిలో 26.54 మీటర్లు, కూకట్పల్లి1లో 26.45 మీటర్ల కిందికి భూగర్భ జలాలు పడిపోయాయి.
గ్రేటర్ పరిధిలోని 40 మండలాల్లో 21 శాతం నుంచి 51 శాతం దాకా తక్కువ వర్షపాతం నమోదు కావడమే భూగర్భ జలాలు ఘోరంగా పడిపోవడానికి కారణమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. జూన్ 1 నుంచి అక్టోబర్ 31 వరకు 34 శాతం లోటు వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. గ్రేటర్ పరిధిలోని కేవలం 6 మండలాల్లో మాత్రమే సాధారణ వర్షపాతం నమోదు కాగా మిగిలిన మండలాల్లో తీవ్రమైన లోటు వర్షపాతం నమోదైందని వివరించారు.
భూగర్భ జలాల పతనం వివరాలు (మీటర్లలో..)
మండలం గ్రౌండ్ వాటర్ గ్రౌండ్ వాటర్
లెవల్స్ (సెప్టెంబర్) లెవల్స్ (అక్టోబర్)
1. కూకట్పల్లి 20.67 22.88
2. శంకర్పల్లి 19.25 21.81
3. మేడిపల్లి 18.23 20.31
4. హయత్‌నగర్ 19.46 19.32
5. మల్కాజిగిరి 17.11 17.89
6. అమీర్‌పేట 16.79 17.15
7. కుత్బుల్లాపూర్ 16.09 17.02
8. సరూర్‌నగర్ 14.66 16.93
9. పటాన్చెరు 15.11 16.54
10. ఉప్పల్ 14.85 15.52
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

