వేలేరు : విద్యార్థులు పరీక్షలకు భయపడకుండా ధైర్యం ఎదుర్కోవాలని, కష్టపడి చదివితే మంచి ఫలితాలు సాధించవచ్చని వేలేరు ఎస్ఐ అజ్మీర సురేష్ తెలిపారు. సోమవారం హనుమకొండ జిల్లా వేలేరు మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న విద్యార్థులకు ప్యాడ్స్ పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ప్రతి విద్యార్థి తన లక్ష్యాన్ని నిర్దేశించుకుని క్రమశిక్షణతో చదువుకుంటే జీవితంలో ఉన్నతస్థాయికి చేరుకోవచ్చని సూచించారు. పరీక్షల సమయంలో ఒత్తిడికి గురి కాకుండా ప్రశాంతంగా ఉండాలని సమయాన్ని సక్రమంగా వినియోగించుకోవాలని తెలిపారు. పరీక్షల సమయంలో మొబైల్స్, సోషల్ మీడియా, దృష్టిని మళ్లించే అంశాలకు దూరంగా ఉండాలన్నారు.