హనుమకొండ చౌరస్తా, జనవరి 1: సౌత్‌జోన్ ఇంటర్ యూనివర్సిటీ టోర్నమెంట్స్‌కు కాకతీయ యూనివర్సిటీ బ్యాడ్మింటన్ జట్టును ఎంపిక చేశామని స్పోర్ట్స్‌బోర్డు కార్యదర్శి వెంకయ్య(Venkaiah) తెలిపారు. జనవరి3 నుంచి 6 వరకు గుంటూరులోని కోనీరు లక్ష్మయ్య ఎడ్యుకేషన్ ఫౌండేషన్‌లో జరిగే ఈ టోర్నరమెంట్కు ఏడుగురితో కూడిన బృందాన్ని పంపిస్తున్నామని ఆయన చెప్పారు.
కాకతీయ యూనివర్సిటీ బ్యాడ్మింటన్ జట్టులో జి.మోహన్‌దాస్(హనుమకొండ వాగ్దేవి డిగ్రీ అండ్ పీజీ కాలేజీ), వి.శివరాం (నర్సంపేట ప్రభుత్వ డిగ్రీ కాలేజీ), బి.వెంకటేశ్(కేయూ), కె.విశాల్ ఆదిత్య, కె.శ్రీథిన్, జే.అనిరుధ్ (కిట్స్ కాలేజీ ), కె.తులసీనాథ్(ఏటూరునాగారం ప్రభుత్వ డిగ్రీ కాలేజీ)లు ఉన్నారు. సౌత్ జోన్ ఇంటర్ యూనివర్సిటీ టోర్నమెంట్లో ఈ బృందానికి వాగ్దేవి ఫిజికల్ ఎడ్యుకేషన్ కాలేజీ పీడీ ఏ.నాగరాజు కోచ్‌గా, మేనేజర్‌గా వ్యవహరిస్తారని వెంకయ్య పేర్కొన్నారు.