బచ్చన్నపేట మార్చి 4 : జనగామ జిల్లా బచ్చన్నపేట మండల కేంద్రంలోని వాణి ఉన్నత పాఠశాలలో బుధవారం ఘనంగా స్వయం పరిపాలన దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఉపాధ్యాయులుగా నటించి విద్యార్థులకు పాఠాలు బోధించారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాధికారిగా ఎండీ సహారా, ఉప విద్యాశాఖాధికారిగా యం. శ్రీనాథ్, ఎంఈఓగా కక్కర్ల అక్షయ, ప్రిన్సిపాల్‌గా గుంటుపల్లి సాత్విక, కరస్పాండెంట్‌గా యం. సాకేత్ వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ప్రిన్సిపాల్ చేతుల మీదుగా బహుమతులు ప్రదానం చేశారు.
ఇందులో హై స్కూల్ స్థాయిలో మొదటి స్థానం యన్. దీక్షిత, ద్వితీయ స్థానంలో బి. దీప్తి, భాషా విభాగంలో యస్. నాగదుర్గ( ప్రథమ) ఉప్పలోజు వర్షిత (ద్వితీయ) ప్రైమరీ స్థాయిలో పీ. మధుప్రియ( ప్రథమ) వై. భవ్యశ్రీ( ద్వితీయ) స్థానం అలాగే ఆప్షనల్ విభాగంలో సీహెచ్. ఉపేక్ష( ప్రథమ) జి.రితిక (ద్వితీయ) స్థానం అలాగే ప్రీ ప్రైమరీ విభాగం లో (ప్రథమ) కే. అఖిరానందన్ అలాగే ఏ. శ్రీజ( ద్వితీయ) స్థానంలో నిలిచారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ సుమలత మాట్లాడుతూ స్వయం పరిపాలన దినోత్సవం నిర్వహించడం ద్వారా పిల్లలో నాయకత్వ లక్షణాలు పెంపండమే కాకుండా బాధ్యతాయుత పౌరులుగా తయారవుతారని తెలిపారు.
ఇందులో న్యాయ నిర్ణేతలుగా బి. పృథ్వీరాజు ఎస్ ఏ ఇంగ్లీష్ జడ్ పి హెచ్ ఎస్ బచ్చన్నపేట, ఎస్ బాబు, సీఎచ్ స్వాతి ఉపాధ్యాయులు వాణి హై స్కూల్ వ్యవహరించారు. అలాగే స్కూల్ ఉపాధ్యాయులు శ్వేత, షారూఖ్, సంధ్య, సరళ, కావ్య, స్వప్న, అనూష, శశికళ, పద్మ, రజిత, రోజా, మౌనిక పాల్గొన్నారు.