కాజీపేట, డిసెంబర్ 23 : కాజీపేట రైల్వే జంక్షన్ పరిధిలోని రైల్వే ఈఎల్ఎస్ పార్కులో మంగళవారం షెడ్యూల్డ్ కులాల హక్కుల అభివృద్ధి సమితి కార్మిక విభాగం రాష్ట్ర అధ్యక్షులు కార్మిక రత్న డా. యమడాల హను కాంత్ ఆధ్వర్యంలో పేద, అనాథ వృద్ధులకు, చీరలు, దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీడబ్ల్యూసీ చైర్ పర్సన్ వసుధ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ
భవిష్యత్తులో షెడ్యూలు కులాల హక్కుల సమితి ఆధ్వర్యంలో పేదలకు, కార్మికులకు మరిన్ని మెరుగైన సేవలు అందించాలని ఆకాంక్షించారు.
సమాజంలో చిన్న పిల్లలను వారి తల్లి దండ్రులు గమనిస్తూ ఉండాలని సూచించారు. సమాజంలో బాల్య వివాహాలు జరుగు తున్నట్లు తెలిస్తే సంబధిత అధికారులకు సమాచారం అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ విజయశ్రీ రజాలి, సీడబ్ల్యూసీ మెంబర్ మధు, హన్మకొండ వరంగల్ జిల్లా అధ్యక్షులు సండ్ర పెద్ద కుమారస్వామి, బందేల చందు, సెక్రటరీ, మంద, స్వామి, భాగ్య, సంధ్య శిరీష, రజిత, శైలేజ, రామ, రాజమణి తదితరులు పాల్గొన్నవారు.