హనుమకొండ చౌరస్తా, ఫిబ్రవరి 11: మహాశివరాత్రి జాతర సందర్భంగా భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఈనెల 14 నుంచి 16 వరకు వరంగల్ రీజియన్ పరిధిలోని శైవపుణ్యక్షేత్రాలకు ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు వరంగల్ రీజినల్ మేనేజర్ దర్శనం విజయభాను తెలిపారు. ఈ సందర్భంగా మొత్తం 235 ప్రత్యేక సర్వీసులు వివిధ శైవపుణ్యక్షేత్రాలకు ఏర్పాటు చేసినట్లు ఆయన వెల్లడించారు. వేములవాడకు- 60, కాళేశ్వరానికి-50, కొమురవెల్లి-40, ఐనవోలుకు-25, కురవికి-20, పాలకుర్తికి-25, రామప్పకు-15 బస్సులు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.
అదేవిధంగా భక్తుల సౌకర్యార్థం పాలకుర్తి, రామప్ప, కొరవి, కొమురవెల్లి శైవపుణ్యక్షేత్రాలకు ప్రత్యేక ఆర్టీసీ శిబిరాలు ఏర్పాటు చేయనున్నట్లు, భక్తులు ఈ ప్రత్యేక బస్సు సర్వీసులను వినియోగించుకుని సురక్షితంగా, సౌకర్యవంతంగా తమ శైవపుణ్యక్షేత్రాలను సందర్శించి మొక్కుల సమర్పణ పూర్తి చేసుకోవాలని, ఈ బస్సుల్లో మహాలక్ష్మి పథకం వర్తిస్తుందని, ప్రయాణికులు ఈ సదవకాశాన్ని వినియోగించుకోవాలని ఆర్ఎం కోరారు.