బచ్చన్నపేట ఫిబ్రవరి 19 : నిరుపేద కుటుంబాలకు ఆర్థిక సహాయం అందిస్తూ అండగా ఉంటానని సామాజిక సేవా కార్యకర్త పోతుల రాములు యాదవ్ అన్నారు. గురువారం జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం పొచ్చన్నపేటలో అనారోగ్యంతో మృతి చెందిన రేణిగుంట బాలయ్య కుటుంబాన్ని కలిసి పరామర్శించారు. నేనున్నానని మనోధైర్యాన్ని నింపి ఆర్థిక సహాయంగా 5000 రూపాయలు అందించారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబ సభ్యులు మాట్లాడుతూ అడగకుండానే ఇంటికి వచ్చి ఆర్థిక సాయం అందించిన రాములుకు రుణపడి ఉంటామని తెలియజేశారు.
పోతుల రాములు యాదవ్ మాట్లాడుతూ నిరుపేదలకు సహాయము అందించడం, ఆదుకోవడంలోనే జీవితం సంతృప్తి కలుగుతుందని అన్నారు. రానున్న రోజుల్లో మరిన్ని సేవా కార్యక్రమాలు చేయడానికి ముందు ఉంటానని అన్నారు. కార్యక్రమంలో రేణుకుంట సత్తయ్య, బాలరాజు, దిలీప్, తరిగొపు శ్రీశైలం, రేణుకుంట యాదయ్య, భాను, తీగల చంద్రమౌళి, మంత్రి సిద్ధులు ,రేణుకుంట జయమ్మ తదితరులు పాల్గొన్నారు.