హైదరాబాద్, ఆగస్టు 9 (నమస్తే తెలంగాణ) : ఆదివాసీ గిరిజనుల హక్కులు, చట్టాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కాలరాస్తున్నాయని తెలంగాణ గిరిజన సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమావత్ అంజయ్యనాయక్ ఆరోపించారు. ప్రపంచ ఆదివాసీ గిరిజన దినోత్సవం సందర్భంగా తెలంగాణ గిరిజన సమాఖ్య ఆధ్వర్యంలో ఆదివారం గిరిజన సమాఖ్య పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం గిరిజనులకు ఇచ్చిన హామీలు అమలుకు నోచుకోవడం లేదని ఆవేదన వ్యక్తంచేశారు.
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న గిరిజనులకు అభివృద్ధి, సంక్షేమ పథకాలు కొనసాగించాలని డిమాండ్ చేశారు. దేశానికి స్వా తంత్య్రం వచ్చి 80 ఏండ్లు అవుతున్నా నేటికీ ఆదివాసీలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వివక్ష కొనసాగిస్తున్నాయని మండిపడ్డారు. రాబోయే రో జుల్లో గిరిజన హక్కులు, చట్టాల పరిరక్షణ కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై మిలిటెంట్ ఉద్యమాలకు పిలుపునిస్తామని అంజయ్యనాయక్ హెచ్చరించారు. కార్యక్రమంలో హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు నేనావత్ రూప్సింగ్నాయక్, కార్యదర్శి హరినాయక్, సహాయ కార్యదర్శి వడ్త్యా దస్రూనాయక్ తదితరులు పాల్గొన్నారు.