న్యూయార్క్: హోర్ముజ్ జలసంధి రీఓపెనింగ్ అంశంపై ఇరాన్ తాజాగా ఏడు రోజుల శాంతి ప్రతిపాదన చేసిన విషయం తెలిసిందే. అయితే ఆ ప్రతిపాదనను అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్(Donald Trum) వ్యతిరేకించినట్లు తెలుస్తోంది. నవంబర్‌లో జరిగే మధ్యంతర ఎన్నికల తర్వాత మళ్లీ ఇరాన్‌పై దాడులు చేసే అవకాశాలు ఉన్నట్లు ట్రంప్ వెల్లడించారు. అయితే ఆ వ్యాఖ్యలకు చెందిన రిపోర్టును వాల్‌స్ట్రీట్ జర్నల్ రాసింది. ఖతార్ మధ్యవర్తుల ద్వారా అమెరికాకు తమ శాంతి ప్రణాళిక తెలియజేసినట్లు ఐక్యరాజ్యసమితి ప్రసంగంలో ఇరాన్ మంత్రి అబ్బాస్ అరగాచీ తెలిపారు. ఏడు రోజల శాంతి ఒప్పందం తర్వాత హోర్ముజ్‌ను తెరుస్తామని, ఆ తర్వాత ప్రాంతీయ పోరాటం ఆగుతుందని మంత్రి అరగాచీ తన ప్రతిపాదనలో పేర్కొన్నారు. ఒకవేళ అమెరికా ఆ ప్రతిపాదనకు ఓకే చెప్పకపోయినా, తాము ఆ పరిస్థితిని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నట్లు అరగాచీ చెప్పారు. ఒకవైపు అమెరికా, ఇరాన్ మధ్య శాంతి చర్చలు జరుగుతున్నా.. ట్రంప్ మాత్రం మళ్లీ దాడులకు ప్లాన్ వేసినట్లు తెలుస్తోందని రిపోర్టులో రాశారు.