నీళ్లియ్యకుండా వరుణయాగం ఎందుకు.. శ్రీశైలంలో జల విద్యుత్తు ప్రారంభిస్తే నీళ్లొస్తాయ్
వాన కాలం పంటలకు నాగార్జునసాగర్ జలాశయం నుంచి నీటిని విడుదల చేయాలని బీఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ డిమాండ్ చేశారు. ఆదివారం ఆయన నల్లగొండ జిల్లా హాలియాలో మీడియాతో మాట్లాడుతూ.. సాగర్ ప్రాజెక్టుకు ఎగువన ఉన్న జలాశయాలన్నీ పూర్తిస్థాయి గరిష్ఠ నీటిమట్టానికి చేరుకున్నాయని తెలిపారు.
- ఆ నీటిని పంటలకిస్తే తప్పేంది?
- వరి సాగుకు సాగర్ నీళ్లియ్యాల్సిందే
- సర్కార్‌పై మాజీ ఎమ్మెల్యే భగత్ ఆగ్రహం
హాలియా, ఆగస్టు 9 : వాన కాలం పంటలకు నాగార్జునసాగర్ జలాశయం నుంచి నీటిని విడుదల చేయాలని బీఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ డిమాండ్ చేశారు. ఆదివారం ఆయన నల్లగొండ జిల్లా హాలియాలో మీడియాతో మాట్లాడుతూ.. సాగర్ ప్రాజెక్టుకు ఎగువన ఉన్న జలాశయాలన్నీ పూర్తిస్థాయి గరిష్ఠ నీటిమట్టానికి చేరుకున్నాయని తెలిపారు. త్వరలోనే శ్రీశైలం జలాశయం గరిష్ఠ స్థాయి నీటిమట్టానికి చేరుకునే అవకాశం ఉన్నదని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే శ్రీశైలంలో జల విద్యుత్తు ఉత్పత్తి చేపడితే అక్కడి నుంచి నాగార్జున సాగర్ జలాశయానికి రోజుకు 50 నుంచి 60 వేల క్యూసెక్కులు వచ్చే అవకాశం ఉన్నదని అన్నారు. రెండు రోజులుగా శ్రీశైలంలో జల విద్యుత్తు చేపడుతుండటంతో నాగార్జున సాగర్‌కు ఐదు అడుగుల మేర నీరు వచ్చి చేరిందని తెలిపారు.
ప్రస్తుతం సాగర్ జలాశయంలో 517 అడుగుల మేర నీరు నిల్వ ఉన్నట్టు చెప్పారు. బీఆర్ఎస్ హయాంలో జలాశయం డెడ్‌స్టోరేజీకి చేరినప్పటికీ ఎడమ కాలువకు నీటిని విడుదల చేసిన విషయాన్ని గుర్తుచేశారు. కేసీఆర్ పాలనలో 18సార్లు సాగర్ ఎడమ కాలువకు రెండు పంటల సాగు కోసం నీటిని విడుదల చేసిన ఇక్కడి రైతులను ఆదుకున్నట్టు చెప్పారు. రాష్ట్రంలో వర్షాలు విస్తారంగా కురువాలని, ప్రాజెక్టులు, చెరువులు నిండాలనే ఉద్దేశంతో సోమవారం రాష్ట్ర ప్రభుత్వం నాగార్జునసాగర్‌లో వరుణ యాగం నిర్వహించడం మంచిదే అయినప్పటికీ సాగర్ ఎడమ కాలువకు సాగునీరు ఇవ్వనప్పుడు యాగం ఎందుకని మాజీ ఎమ్మెల్యే భగత్ ప్రశ్నించారు. సీఎం రేవంత్‌రెడ్డి పాలనపై ప్రజల్లో వస్తున్న వ్యతిరేకతను పక్కదారి పట్టించేందుకు వరుణయాగం పేరుతో ప్రభుత్వం కొత్త డ్రామాకు తెరలేపిందని విమర్శించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Cancer Detection | వ్యక్తుల ముఖాల ఫొటోలతో క్యాన్సర్ ఉందో లేదో చెప్పేయవచ్చు.. కొత్త ఏఐని అభివృద్ధి చేసిన పరిశోధకులు..
Cyclone Arnab | ఏపీలో అర్నబ్ బీభత్సం.. పలు జిల్లాలో ఏడుగురు మృతి
ACB Net | లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ లీగల్ మెట్రోలజీ ఇన్స్పెక్టర్
MLA Dr. Sanjay | గోదావరి పుష్కరాల ఏర్పాట్లను త్వరితగతిన పూర్తి చేయాలి : ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్
Transport Department | వాహన దారులకు పారదర్శక సేవలు : రవాణా శాఖ
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

