కృష్ణానది జోరుగా నాగార్జునసాగర్ రిజర్వాయర్ పూర్తి స్థాయికి చేరుకోవడంతో సోమవారం డ్యామ్ క్రస్ట్ గేట్ల ద్వారా నీటి విడుదలను ప్రారంభించగా మంగళవారం కూడా కొనసాగింది.
నాగార్జునసాగర్ ఎడమ కాల్వ నీటితో జిల్లాలోని చెరువులు నింపాలని ప్రభుత్వం నిర్ణయించినందున రైతులు ఆ నీటిని సాగు అవసరాలకు మళ్లించొద్దని కలెక్టర్ నారాయణరెడ్డి కోరారు.
సాగర్ ఎడమ కాల్వకు నీటిని విడుదల చేసి ఎండుతున్న పంటలను కాపాడాలని మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి, తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పోతినేని సుదర్శన్, కార్యదర్శి టీ సాగర్ కోరారు.
కృష్ణా జలాల విడుదలకు సంబంధించిన గణాంకాలను ఎప్పటికప్పుడు సేకరించేందుకు ఏర్పాటు చేసిన టెలిమెట్రీలు సరిగా పనిచేయకపోవడంతో ప్రత్యేకంగా జాయింట్ ఇన్స్పెక్షన్ కమిటీని ఏర్పాటు చేసిన నదీ యాజమాన్య బోర్డు (క