హైదరాబాద్, ఆగస్టు 9(నమస్తే తెలంగాణ) : ఆదివాసీల తెగువకు, ప్రకృతి పరిరక్షణకు కుమ్రం భీం ప్రతీక అని ఆయన ఆశయసాధనకు బీఆర్ఎస్ కట్టుబడి ఉన్నదని ఆ పార్టీ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ఆదివాసీలకు కేటీఆర్ ఆదివారం ‘ఎక్స్’ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. ఆదివాసీల సంసృతీ, సంప్రదాయాలను ఆయన ప్రశంసించారు. గిరిజన, ఆదివాసీల అభ్యున్నతి కోసం కేసీఆర్ ప్రభుత్వ హయాంలో తీసుకున్న పలు చరిత్రాత్మక నిర్ణయాలను కేటీఆర్ వివరించారు. ఎస్టీల రిజర్వేషన్లను 6నుంచి 10 శాతానికి పెంచడం, మారుమూల తండాలు, గూడేలను గ్రామ పంచాయతీలుగా తీర్చిదిద్దడం, వాటికి స్వచ్ఛమైన నీరందించామని గుర్తుచేశారు.
ఆసిఫాబాద్ జిల్లాకు కుమ్రం భీం పేరు పెట్టడమే గాక, ఆయన పోరాటానికి గుర్తుగా జోడేఘాట్‌లో స్మృతివనం నిర్మించినట్టు వివరించారు. ఆదివాసీల ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటేలా హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో కుమ్రం భీం ఆదివాసీ భవన్‌ను నిర్మించామని తెలిపారు. గిరిజన విద్యార్థుల కోసం ఎస్టీ గురుకులాలు, కాలేజీల సంఖ్యను గణనీయంగా పెంచడంతో పాటు, విదేశీ విద్య కోసం అంబేదర్ ఓవర్సీస్ సాలర్షిప్లు అందించామని చెప్పారు. సీఎంఎస్టీఈఐ పథకం ద్వారా గిరిజన బిడ్డలు పారిశ్రామికవేత్తలుగా ఎదిగేలా ప్రోత్సహించిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిదేనని కేటీఆర్ స్పష్టంచేశారు.