పౌరుల విదేశీ ప్రయాణాలపై చైనా ఆంక్షలు
దేశ పారిశ్రామిక, సాంకేతిక భద్రతకు ముప్పుగా పరిగణించే పౌరులు సహా విదేశీ ప్రయాణాలపై ఆంక్షలు విధించే పరిధిని విస్తరించే కొత్త రాకపోకల(ఎంట్రీ-ఎగ్జిట్) నిబంధనలను చైనా మంగళవారం అమలులోకి తెచ్చింది. చైనా జాతీయ భద్రతకు లేదా ప్రయోజనాలకు హాని కలిగించే చట్టవిరుద్ధమైన లేదా నేరపూరిత చర్యలకు విదేశాలలో పాల్పడినట్టు తేలితే చైనా పౌరులు దేశం విడిచి వెళ్లకుండా ఆరు నెలల నుంచి మూడేండ్ల వరకు నిషేధించవచ్చని కొత్త నిబంధనలు పేర్కొంటున్నట్టు రాయిటర్స్ వార్తా సంస్థ పేర్కొంది.
- రాకపోకలపై అమల్లోకి వచ్చిన కొత్త నిబంధనలు
బీజింగ్, సెప్టెంబర్ 15: దేశ పారిశ్రామిక, సాంకేతిక భద్రతకు ముప్పుగా పరిగణించే పౌరులు సహా విదేశీ ప్రయాణాలపై ఆంక్షలు విధించే పరిధిని విస్తరించే కొత్త రాకపోకల(ఎంట్రీ-ఎగ్జిట్) నిబంధనలను చైనా మంగళవారం అమలులోకి తెచ్చింది. చైనా జాతీయ భద్రతకు లేదా ప్రయోజనాలకు హాని కలిగించే చట్టవిరుద్ధమైన లేదా నేరపూరిత చర్యలకు విదేశాలలో పాల్పడినట్టు తేలితే చైనా పౌరులు దేశం విడిచి వెళ్లకుండా ఆరు నెలల నుంచి మూడేండ్ల వరకు నిషేధించవచ్చని కొత్త నిబంధనలు పేర్కొంటున్నట్టు రాయిటర్స్ వార్తా సంస్థ పేర్కొంది. పారిశ్రామిక లేదా సాంకేతిక భద్రతకు ముప్పు కలిగించే ఎగుమతి నియంత్రణలు, సాంకేతికత దిగుమతి-ఎగుమతి నిబంధనల ఉల్లంఘనలు కూడా ఈ నిబంధనల పరిధిలోకి వస్తాయి.
సెమీకండక్టర్లు, కృత్రిమ మేధ(ఏఐ) వంటి కీలక రంగాల్లో ఆధిపత్యం కోసం చైనా, అమెరికా పోటీపడుతున్న తరుణంలో ఈ చర్యలు తీసుకున్నారు. ఈ పరిశ్రమలకు చెందిన కొందరు ఉన్నతాధికారులు చైనాను విడిచి వెళ్లడంపై ఆంక్షలు ఎదుర్కొన్నారని గతంలోనే వార్తలు వచ్చాయి. అధిక-ప్రమాదకరమైనవిగా పరిగణించే దేశాలు లేదా ప్రాంతాలకు ప్రయాణించవద్దని చైనా పౌరులకు సూచించాలని కూడా సరిహద్దు అధికారులను ఈ నిబంధనలు ఆదేశిస్తున్నాయి. మరోవైపు, వీసా దరఖాస్తులలో తప్పుడు సమాచారాన్ని సమర్పించే విదేశీయులకు ఒకటి నుంచి ఐదు సంవత్సరాల పాటు దేశంలోకి ప్రవేశం నిరాకరించవచ్చు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
RRR | రీజినల్ రింగ్ రోడ్ ఉత్తర భాగానికి కేంద్రం బ్రేక్.. ప్రస్తుత అలైన్మెంట్తో ప్రాజెక్టుకు ఆమోదం కష్టమే!
Congenital Birth: ఒడిశాలో రెండు తలలతో పుట్టిన మగ శిశువు
Mithun Chakraborty | ‘జైలర్ 2’లో రజనీకాంత్‌కు మిథున్ చక్రవర్తి కండీషన్.. విలన్ పాత్రకు ఓకే చెప్పడానికి అదే కారణమా?
Raja Saab | ‘రాజా సాబ్’ ఫ్లాప్‌కు అదే ప్రధాన కారణం.. తొలిసారి అసలు విషయం చెప్పిన నిర్మాత టీజీ విశ్వప్రసాద్!
Pope Leo XIV: పోప్ లియోకు ఊపిరితిత్తుల క్యాన్సర్.. సర్జరీతో కణితి తొలగింపు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

