హైదరాబాద్, సెప్టెంబర్ 15 (నమస్తే తెలంగాణ): సీఎం రేవంత్‌రెడ్డితో తనకు చిన్నచిన్న సమస్యలు ఉన్నమా ట వాస్తవమేనని పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ పేర్కొన్నారు. పీసీ సీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టి రెం డేండ్లు పూర్తవుతున్న సందర్భంగా మంగళవారం సీఎల్పీ కార్యాలయం లో మీడియాతో చిట్‌చాట్ చేశారు. పార్టీ అధికారంలోకి వచ్చినా క్యాడర్‌కు సకాలంలో పదవులు ఇవ్వలేకపోయామని పేర్కొన్నారు. కొండా సురేఖ బర్తరఫ్ బాధాకరమని, అది అధిష్ఠానం నిర్ణయంగా తేల్చిచెప్పారు. ఏదో ఒకరోజు రాష్ట్రం లో బీసీలకు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం వస్తుందని చెప్పారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో నిజామాబాద్ జిల్లా నుంచి పోటీ చేయడం ఖాయమని ప్రకటించారు. .
సురేఖ చాంబర్ల సీజ్
హైదరాబాద్, సెప్టెంబర్ 15 (నమస్తే తెలంగాణ): మాజీ మంత్రి కొండా సురేఖ చాంబర్లను సచివాలయ అధికారులు సీజ్ చేశారు. సచివాలయంలోని 4వ అంతస్తు 4ఎఫ్ విభాగంలో కొండా సురేఖకు కేటాయించిన 10,11,12 నంబర్ గదులను తమ ఆధీనంలోకి తీసుకున్నారు. కొండా సురేఖ పేషీలో పనిచేసిన అవుట్సోర్సింగ్ ఉద్యోగులను విధుల నుంచి తొలగించారు.