తొలి పంపు ఉప్పొంగి నేటికి మూడేండ్లు.. కాంగ్రెస్ మూడేండ్ల హయాంలో వివక్ష
కేసీఆర్ ప్రభుత్వ హయాంలో పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు శ్రీశైలం డెడ్‌స్టోరేజీ పాయింట్ కోతిగుండు వద్ద వరదను లిఫ్ట్ చేసేలా రూపకల్పన చేశారు. ప్రపంచంలోనే అతిపెద్ద 145 మెగావాట్స్ సామర్థ్యం కలిగిన బాహుబలి మోటర్లతో రెండు టీఎంసీలు ఎత్తిపోశారు.
- 2023 సెప్టెంబర్ 16న పాలమూరు ప్రాజెక్టును జాతికి అంకితం చేసిన కేసీఆర్
- బీఆర్ఎస్ పాలనలో 90% పనులు పూర్తి
కొల్లాపూర్, సెప్టెంబర్ 15 : కేసీఆర్ ప్రభుత్వ హయాంలో పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు శ్రీశైలం డెడ్‌స్టోరేజీ పాయింట్ కోతిగుండు వద్ద వరదను లిఫ్ట్ చేసేలా రూపకల్పన చేశారు. ప్రపంచంలోనే అతిపెద్ద 145 మెగావాట్స్ సామర్థ్యం కలిగిన బాహుబలి మోటర్లతో రెండు టీఎంసీలు ఎత్తిపోశారు. 90 శాతం పనులన్నీ పూర్తి కావడంతో 2023 సెప్టెంబర్ 16న నార్లాపూర్ పంప్‌హౌస్‌లో తొలి భారీ పంప్‌ను కేసీఆర్ ప్రారంభించి, పాలమూరు నేలపై కొత్త చరిత్రకు శ్రీకారం చుట్టారు. శ్రీశైలం బ్యాక్ వాటర్‌ను నార్లాపూర్ రిజర్వాయర్‌లోకి 2 టీఎంసీలు ఎత్తిపోశారు. పనులు చూసిన రైతులు కృష్ణమ్మకు పూజలు చేశారు. కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం రావడంతో పీఆర్ఎల్ఐ పనుల్లో వేగం మందగించింది. మూడేైండ్లెనా పనులు పూర్తి చేయకుండా 270 టీఎంసీలను ఏపీకి అప్పగించిందని నిపుణులు పేర్కొంటున్నారు.
మూడు సీజన్ల వరద వృథా
పాలమూరు ప్రాజెక్టుతో ఉమ్మడి పాలమూరుతోపాటు రంగారెడ్డి జిల్లా సస్యశ్యామలం అవుతుందన్న సాగునీటి కలకు ప్రతిరూపంగా నిర్మించారు. శ్రీశైలం జలాశయం నుంచి 60 రోజుల్లో 90 టీఎంసీలను ఎత్తిపోసేలా పథకాన్ని రూపొందించారు. రోజుకు సగటున 1.5 టీఎంసీల నీటిని ఎత్తిపోసే సామర్థ్యం ప్రాజెక్టుకు ఉంది. రేవంత్ సర్కార్ వచ్చాక ఇప్పటి వరకు పంప్‌లను ఆన్ చేయలేదు. ప్రాజెక్టు పూర్తి సామర్థ్యంతో కొనసాగితే గరిష్ఠంగా 270 టీఎంసీలను ఎత్తిపోసే అవకాశం ఉండేది. మూడేండ్లలో ఎందుకు నీటిని ఎత్తిపోయలేదన్న ప్రశ్న రైతుల్లో ఉత్పన్నమవుతున్నది. ఇప్పటికే నార్లాపూర్, ఏదుల, వట్టెం, కరివెన రిజర్వాయర్లు సైతం సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తున్నది. కొల్లాపూర్, పెద్దకొత్తపల్లి మండలాల మధ్యలో కేవలం 10 శాతం పెండింగ్ పనులను బూచిగా చూపిన సర్కార్ నీటిని ఎత్తిపోయలేదని ఈ ప్రాంత రైతులు ఆరోపిస్తున్నారు. పాలమూరు పంపులను ఆన్ చేసి వరద జలాలను ఒడిసి పట్టి ఉంటే ఈ ఏడాది ప్రస్తుతం ఏర్పడిన వర్షాభావ పరిస్థితులను జయించే అవకాశం ఉండేదని సాగునీటిరంగ నిపుణులు పేర్కొంటున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nirmal Rythu Garjana | నిర్మల్ రైతు గర్జన సభ ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే వేముల, బీఆర్ఎస్ నేతలు
Sonia Gandhi | ‘నాకు ఇష్టం లేకపోయినా బలవంతంగా ఓకే చెప్పా’.. ప్రధాని పదవిపై సోనియాగాంధీ
Sharmistha Mukherjee: ప్రణబ్ ముఖర్జీపై సోనియా కామెంట్స్.. కౌంటర్ ఇచ్చిన శర్మిష్ట ముఖర్జీ
‘బుడ్డగూడెం’ కేంద్రంగా అక్రమ ఇసుక రవాణా
Drinking Water | నిజామాబాద్ శివారులో తాగునీటి కోసం రోడ్డెక్కిన ప్రజలు.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

