హనుమకొండ చౌరస్తా, ఏప్రిల్ 5 : ముదిరాజ్ ఎంప్లాయిస్ అండ్ ప్రొఫెషనల్స్అసోసియేషన్(మెపా) హనుమకొండ జిల్లా కమిటీని శనివారం ఎన్నుకున్నారు. మెపా రాష్ర్ట నాయకుడు పులి ప్రభాకర్ ముదిరాజ్ అధ్యక్షతన హనుమకొండలో నిర్వహించిన సమావేశంలో కమిటీ అధ్యక్ష కార్యదర్శులతో పాటు కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ముఖ్యఅతిథిగా హాజరైన వ్యవస్థాపక రాష్ర్ట అధ్యక్షులు పులి దేవేందర్ ముదిరాజ్ మాట్లాడుతూ వివిధ సామాజిక కార్యక్రమాలతో మెపా రాష్ర్టవ్యాప్తంగా దూసుకెళుతుందని, ముదిరాజ్ కుల బంధువులందరికీ పరస్పర సహకారమే పరమావధిగా మెపా పని చేస్తుందన్నారు.
హనుమకొండ జిల్లా అధ్యక్షుడిగా పులి రాజేష్ ముదిరాజ్, ప్రధాన కార్యదర్శి అమ్మగారి శ్యామ్‌సుందర్, గౌరవ అధ్యక్షులు పులి సదానందం, ఉపాధ్యక్షులుగా సిద్ద సుమన్, గోనెలా విజేందర్, మట్టెపల్లి సాంబయ్య, కార్యదర్శిలుగా వాసు శ్రీను, రోకుల సందీప్, కేశబోయిన కోటేశ్వరరావు, కోశాధికారిగా మట్టేపల్లి రణధీర్, కార్యవర్గ సభ్యులుగా కట్ల విజయ్, ఉడుతబోయిన క్రాంతికుమార్ ముదిరాజ్‌లను ఎన్నుకున్నారు. అనంతరం నూతనంగా ఎన్నికైన కమిటీ బాధ్యులకు పులి దేవేందర్ ముదిరాజ్ రాష్ర్ట కమిటీ చేతుల మీదుగా నియామక పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో మెపా రాష్ర్ట ఉపాధ్యక్షులు పొన్నం రాజు, రాష్ర్ట కార్యదర్శులు సింగారపు రామకృష్ణ, నీరటి రాజు, బోనాల రమేష్, బరిగేల భాస్కర్, వరంగల్ జిల్లా అధ్యక్షులు తాళ్ల రవీందర్, టీఎన్జీవో రాష్ర్ట ఉపాధ్యక్షులు పులి ప్రభాకర్, హనుమకొండ జిల్లా టీఎన్జీవో ప్రధాన కార్యదర్శి బైరి సోమయ్య, ఈరబోయిన వినోద్, బోడ రంజిత్, పులి మహేష్, సంతోష్‌కుమార్, భాను ప్రకాష్, ఐలయ్య, దుర్గేష్, పులి శ్రీనివాస్, అనిల్‌కుమార్, వేణుగోపాల్ పాల్గొన్నారు.