హనుమకొండ చౌరస్తా, జూలై 7: రేవంత్ సర్కారు ఏర్పడిన రెండున్నరేళ్లు గడుస్తున్నా దివ్యాంగులకు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు 6 వేల పింఛన్ పెంపు, ఉచిత బస్సు ప్రయాణం, రాజకీయ రిజర్వేషన్లు, జిల్లాల్లో ప్రత్యేక శాఖ ఏర్పాటు హామీలు అమలు చేయడంలో రేవంత్‌రెడ్డి పూర్తిగా విఫలమయ్యాడని ఎన్పీఆర్డీ ఇండియా జాతీయ అధ్యక్షుడు తుడుం రాజేందర్ మండిపడ్డారు. మంగళవారం హనుమకొండ ప్రెస్‌క్లబ్‌లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు.
కాంగ్రెస్‌ను గెలిపిస్తే అధికారం చేపట్టిన మొదటి నెలలోనే దివ్యాంగులకు ఇచ్చే 4 వేల పింఛన్ 6 వేలకు పెంచుతామని రేవంత్‌రెడ్డి నమ్మబలికాడని కానీ సీఎం అయి 28 నెలల తర్వాత ఈరోజుకు పింఛన్ 6 వేలకు పెంచకపోవడం తెలంగాణ రాష్ట్రంలో దివ్యాంగులను మోసం చేయడమేనన్నారు. సమావేశంలో దివ్యాంగులు లాసాని నర్సింరావు, అడ్డ రాజు, సుదమల్ల ప్రశాంత్, నీలంబరం, ఎం.రమేశ్, రమేశ్, విజయరాజు, జెరిపోతుల నర్సింలు, భూక్య రాజు, కుమారస్వామి, నంగాల శ్రీనివాస్, జన్ను నర్సయ్య, పెండల భిక్షపతి, సంగీత్, లింగమూర్తి, రమాదేవి పాల్గొన్నారు.