హనుమకొండ చౌరస్తా, సెప్టెంబర్ 9: తెలంగాణ ప్రజల గుండె చప్పుడు కాళోజీ నారాయణరావు అని పింగిళి కాలేజీ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ చంద్రమౌళి అన్నారు. బుధవారం పింగిళి కాలేజీలో కాళోజీ జయంతి, తెలంగాణ భాషా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కాళోజీ చిత్రపటానికి నివాళుల ర్పించారు. తెలంగాణ యాసకు, భాషకు గౌరవాన్ని కలిగించిన మహానీయుడు, ప్రజాకవి కాళోజీ అని, నిజాం నిరంకుశత్వాన్ని ఎదిరించిన పోరాట యోధుడు అని అభివర్ణించారు.
కార్యక్రమ నిర్వాహకుడు కళాశాల తెలుగు విభాగాధిపతి ఎస్ మధు, వైస్ ప్రిన్సిపాల్ జి.సుహాసిని , తెలుగు అధ్యాపకులు లక్ష్మీకాంతం, రామారత్నమాల, బి.సునీత, అధ్యాపకులు కె.రాజేశ్వరి, యుగంధర్, మమత, వివిధ విభాగాధిపతులు, బోధన, బోధనేతర సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు నిర్వహించిన వ్యాసరచన, వక్తృత్వ పోటీలలో విజేతలైన విద్యార్థులకు బహుమతులు అందించారు.