గోవిందరావుపేట : నాణ్యమైన విత్తనాలతోనే అధిక దిగుబడి సాధ్యమవుతుందని ప్రొఫెసర్ డా. బి.విద్యాధర్ అన్నారు. ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం, వ్యవసాయ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రతి గ్రామానికి నాణ్యమైన విత్తనం అనే కార్యక్రమాన్ని గోవిందరావుపేట మండలంలోని రైతు వేదికలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక పీఏసీఎస్ చైర్మన్ ఎల్లారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నాన్నారు.
వరి వంగడం WGL -962 గుణ గుణాలను వివరించారు. ఈ కార్యక్రమంలో భాగంగా మండంలోని ఇద్దరు రైతులకు 10 కిలోల వరి విత్తన కిట్లను అందజేశారు. తదనంతరం వరి పంటలో సాగు మెలకువలను తెలిపారు. రైతుల సందేహాలను నివృత్తి చేశారు. ఈ కార్యక్రమంలో డా.జె.కమలాకర్, డా. ఎం.మధు, మండల వ్యవసాయ అధికారి జితేందర్ రెడ్డి, వివిధ క్లస్టర్ల వ్యవసాయ విస్తరణ అధికారులు, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.