హనుమకొండ చౌరస్తా, ఫిబ్రవరి 26: యూనివర్సిటీ ఆర్ట్ కాలేజీ ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ సెల్ ఆధ్వర్యంలో ఈనెల 27న టాటా ఏఐఏ ఇన్సూరెన్స్, గాయత్రి కమ్యూనికేషన్ సంయుక్తంగా ఏర్పాటు చేసిన రిక్రూట్మెంట్ డ్రైవ్లో అన్ని గ్రూపుల డిగ్రీ ఫైనలియర్ అండ్ పాస్డ్ ఔట్ విద్యార్థులు పాల్గొనవచ్చని ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ సుంకరి జ్యోతి తెలిపారు.
గురువారం కాలేజీ పోస్టర్లు వారు విడుదల చేశారు. కార్యక్రమంలో ట్రైనింగ్ ప్లేస్మెంట్ అధికారి జితేందర్, సీనియర్ ఫ్యాకల్టీ దామర బిక్షపతి, ఫిరోజ్పాషా, నహీదా పర్వీన్, చందులాల్, టాటా ఏఐఏ ప్రతినిధి మేడిపల్లి శివకుమార్, గాయత్రి కమ్యూనికేషన్ నుంచి జన్ను జేసన్ పాల్గొన్నారు.