నల్లబెల్లి, ఆగస్టు 9 : వరంగల్ జిల్లా నల్లబెల్లి మండల కేంద్రంలో సోమవారం దివంగత మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి సంస్మరణ సభ జరగనుంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, శాసనసభా పక్ష ఉప నేత హరీశ్‌రావుతో పాటు ఉమ్మడి జిల్లా, రాష్ట్రస్థాయి నేతలు హాజరుకానున్నారు.
రాష్ట్ర నలుమూలల నుంచి పార్టీ శ్రేణులు, అన్ని వర్గాల ప్రజలు, నర్సంపేట నియోజకవర్గంలోని అభిమానులు పెద్ద సంఖ్యలో తరలిరానున్న నేపథ్యంలో సభాస్థలితో పాటు వీవీఐపీ, వీఐపీ వాహనాల పార్కింగ్, భోజన వసతి, తాగునీటి సరఫరాతోపాటు అవసరమైన అన్ని ఏర్పాట్లను నిర్వాహకులు పూర్తిచేశారు.