Hanumakonda | హనుమకొండలో ఘనంగా ప్రతాపరుద్ర దేవుడి జయంతి
చారిత్రిక రుద్రేశ్వరస్వామి వేయిస్తంభాల దేవాలయ కుడా గార్డెన్లో దేవర విష్ణువర్ధన్‌రెడ్డి ఆధ్వర్యంలో 5వ కాకతీయ రాజైన ప్రతాపరుద్రుని జయంతి ఉత్సవం నిర్వహించారు.
హనుమకొండ చౌరస్తా, మార్చి 25: చారిత్రిక రుద్రేశ్వరస్వామి వేయిస్తంభాల దేవాలయ కుడా గార్డెన్లో దేవర విష్ణువర్ధన్‌రెడ్డి ఆధ్వర్యంలో 5వ కాకతీయ రాజైన ప్రతాపరుద్రుని జయంతి ఉత్సవం నిర్వహించారు. జ్యోతిప్రజ్వలన చేసి ప్రతాపరుద్రుని చిత్రపటానికి పూలమాలలువేసి ప్రతాపరుద్రుడిని స్మరించుకున్నారు. విష్ణువర్ధన్‌రెడ్డి మాట్లాడుతూ కాకతీయులు గొలుసుకట్టు చెరువులు నిర్మించి వేయ్యి సంవత్సరాల క్రితమే రైతులు సుభిక్షంగా ఉండాలని సాగునీరు, తాగునీరుకు అనేకమైన జలాశయాలు నిర్మించారన్నారు.
ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ కాకతీయ మూలపురుషుడైన ప్రతాపరుద్రుడు గొప్ప రాజనీతిజ్ఞుడు, ఉత్తరమున గోదావరి నది తీరం వరకు రాజ్యాన్ని విస్తరింపజేశాడని ఆయన వివరించారు. కార్యక్రమంలో టిపిసిసి ప్రధాన కార్యదర్శి బుద్దిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, కార్పొరేటర్లు తోట వెంకటేశ్వర్లు, పోతుల శ్రీమాన్, సురేందర్, రజాలీ, జక్కుల రవీందర్‌యాదవ్, తాడిశెట్టి విద్యాసాగర్, తోట పవన్, కుమార్‌యాదవ్, టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్షుడు ఆకుల రాజేందర్, సోమయ్య, వేణుగోపాల్ పాల్గొన్నారు.
Read Today's Latest Warangal-rural Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dragon Movie | ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ ‘డ్రాగన్’ షూటింగ్‌పై క్రేజీ అప్డేట్.. నవంబర్ నుంచి కొత్త షెడ్యూల్ షురూ!
Ranabaali | విజయ్ దేవరకొండ ఫ్యాన్స్‌కు బిగ్ షాక్.. ‘రణబాలి’ డబ్బింగ్ వెర్షన్స్ విడుదల వాయిదా!
Riyadh airport | రియాద్ ఎయిర్‌పోర్టుపై దాడిని తీవ్రంగా ఖండించిన భారత్..!
Suchitra Flyover | సుచిత్ర ఫ్లైఓవర్ పనులు వెంటనే ప్రారంభించాలి.. ఫ్లైఓవర్‌కు పిండ ప్రదానం.. వీడియో
Newzealand | భారత్‌తో వందేళ్ల క్రీడానుబంధం.. వన్డే సిరీస్ కోసం ప్రత్యేక జెర్సీ విడుదల..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

