హనుమకొండ చౌరస్తా, ఫిబ్రవరి 19: కాకతీయ యూనివర్సిటీ దూరవిద్య కేంద్రం ఎదురుగా తాగునీటి పైపు లీకేజీ కావడంతో తాగునీరు వృథాగా పోయాయి. తాగునీటి పైపు పగిలిపోయి ఫౌంటేషన్ తరహాలో నీరు ఎగిసిపడ్డాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకు అలాగే తాగునీరు వృథాగా పోతున్నా ఎవరూ పట్టించుకోలేదు.
విద్యార్థులు యూనివర్సిటీ, మున్సిపల్ అధికారులకు తెలియజేసినా పట్టించుకోలేదని వాపోయారు. అధికారులు నిర్లక్ష్యం తాగునీరు వృథాగా పోయాయని, పైపులైన్ మరమ్మతులు చేసి లీకేజీలు లేకుండా అరికట్టాలని విద్యార్థులు కోరుతున్నారు.