హనుమకొండ చౌరస్తా, డిసెంబర్ 3 : స్వచ్ఛమైన గాలిని కోరితే ఈ దేశంలో దేశద్రోహం కేసులు పెడతున్నారని, ఢిల్లీలో కలుషితమైన గాలికి వ్యతిరేకంగా ఆందోళన చేసిన విద్యార్థి సంఘ నాయకులపై మోపిన అక్రమ కేసులను వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ పీడీఎస్యూ నాయకులు నిరసన తెలిపారు. కేయూ మొదటిగేటు వద్ద బుధశారం పీడీఎస్యూ వరంగల్ ఉమ్మడి జిల్లా ప్రధాన కార్యదర్శి మర్రి మహేష్ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఢిల్లీలో కలుషితమైన గాలిని నిరోధించాలని ఆందోళన చేసిన విద్యార్థి సంఘాల నాయకులపై పెట్టిన ఉపా, దేశద్రోహం కేసులు వెంటనే ఎత్తివేయాలని వారిని వెంటనే జైలు నుండి విడుదల చేయాలని ప్లేకార్డ్స్ పట్టుకొని నిరసన కార్యక్రమం చేపట్టారు.
ఈ సందర్భంగా మహేష్ మాట్లాడుతూ భారత దేశంలో స్వచ్ఛమైన గాలి కోరుకోవడం కూడా నేరంగా మారుతుందని, రోజురోజుకు కేంద్రంలోని బీజేపీ పాలనలో ప్రజాస్వామ్యం కరువైతుందన్నారు. ఢిల్లీలోని ఇండియన్ గేటు వద్ద స్వచ్ఛమైన గాలిని కోరుతూ ఆందోళన చేసిన విద్యార్థి సంఘ నాయకులను ఢిల్లీ పోలీసులు అక్రమంగా అరెస్టు చేసి అక్రమ కేసులు పెట్టడం, చెరసాలలో బంధించడం ఇప్పటివరకు పాలన వైఖరిని ప్రశ్నిస్తేనే ఉప దేశద్రోహం కేసులు పెట్టారని, దేశంలో పౌర హక్కులు ప్రజాస్వామ్యం ఈ బీజేపీ పాలనలో ఎంత గొప్పగా అమల్లో అర్థమవుతుందన్నారు.
బీజేపీ దేశ ప్రజల కోసం కాకుండా రక్షణ బలగాలను తన గుప్పట్లో ఉంచుకొని ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తున్నదని, ఈ విధమైన వైఖరిని ప్రజలు, మేధావులు, ప్రజాస్వామిక వాదులు ఖండించాలని దీనికి వ్యతిరేకంగా ఉద్యమించాలని ఆయన పిలుపునిచ్చారు.పీడీఎస్యూ ఉమ్మడి వరంగల్ జిల్లా కార్యవర్గ సభ్యులు వంగెటి మోహన్, యూనివర్సిటీ నాయకులు రాజేష్, రాంబాబు, హరిప్రసాద్, జయచందర్, గణేష్ పాల్గొన్నారు.