ఐనవోలు (హనుమకొండ): ప్రజల సౌకర్యానికి ఉపయోగపడే రోడ్డు పది కాలాల పాటు నాణ్యతగా మన్నికగా ఉండాలి. కానీ అధికారులు పర్యవేక్షణ లోపించడంతో ఐనవోలు మండలంలో (Inavolu) గుత్తేదారుల ఇష్టారాజ్యంతో రోడ్డు నిర్మాణ పనుల్లో నాణ్యత కొరవడింది. నాసిరకంగా పనులు చేపట్టడంతో అవి మూన్నాళ్ల ముచ్చటగా మారుతున్నాయి. నిర్మాణ దశలో ఉన్నతాధికారులు అటువైపు దృష్టి సారించకపోవడంతో పరిస్థితి అద్వానంగా తయారైంది. ‘ప్రారంభం దశలోనే రోడ్డు పై ప్యాచీలు’ వేయాల్సిన పరిస్థితి నెలకొంది.
హనుమకొండ జిల్లా ఐనవోలు మండలం ఒంటిమామిడిపల్లి నుంచి కొండపర్తి గ్రామ మధ్య ప్రధాన మంత్రి గ్రామ సడక్ యోజనలో భాగంగా రూ.6.71 లక్షల అంచన విలువతో 5.6 కిలో మీటర్ల రోడ్డు నిర్మాణం పనులు పూర్తి అయ్యాయి. రోడ్డు నిర్మాణలో గుత్తేదారు నాణ్యత ప్రమాణాలు పాటించపోవడంతో నూతన రోడ్డుపై ఉన్న తారు ఊడిపోయి కంకర తేలడంతో తిరిగి ప్యాచీలు వేసే పరిస్థితి నెలకొంది. ఈ బీటీ రోడ్డును స్థానిక ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు గురువారం ప్రారంభం చేయనుండడం విమర్శలకు తవ్విస్తుంది.