హనుమకొండ చౌరస్తా, డిసెంబర్ 28: తెలంగాణ రాష్ర్ట భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో మిమిక్రీ ఆర్టిస్ట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సహకారంతో డాక్టర్ నేరెళ్ల వేణు మాధవ్ (Nerella Venu Madhav) 94వ జయంతి, స్వరార్చన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. పబ్లిక్ గార్డెన్ నేరెళ్ల వేణుమాధవ్ కళాప్రాంగణంలోని ఆయన విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ప్రసిద్ధ కవి, కథా రచయిత, నవలాకారులు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ స్వర్ణనంది పురస్కార గ్రహీత ప్రొఫెసర్ రామా చంద్రమౌళికి నేరెళ్ల వేణుమాధవ్ స్మారక ప్రతిభా పురస్కారాన్ని అందజేశారు.
నేరెళ్ల వేణుమాధవ్ ట్రస్ట్ అధ్యక్షురాలు నేరెళ్ల శోభా వేణుమాధవ్ మాట్లాడుతూ.. తల నుంచి వేలు వరకు పూర్తిగా కళాహృదయం కలవాడు వేణుమాధవ్ అని గుర్తుచేశారు. ప్రతి ఒక్కరిలో ఉన్న కళ బయటికి తీసుకువచ్చేందుకు నేరెళ్ల వేణుమాధవ్ ఎంతో కృషి చేశారని, కల ఎవరి సొత్తు కాదు ఎవరు నేర్చుకుంటే వారికి వస్తుందని న్నారు. వేణుమాధవ్ నేరెళ్ల వేణుమాధవ్ ప్రదర్శన ఇచ్చిన తర్వాత ప్రతిసారి ఎలా ఉంది? అని అడిగేవారు, నేను బాగున్నది అని చెప్పేవాడినిన నేను ఆయన్ని ప్రతిక్షణం గుర్తుచేసుకుంటున్నా. ఆయన అత్యంత ఉన్నత స్థానానికి మిమిక్రీ కళను తీసుకెళ్లారని కేంద్ర సాహిత్య అకాడమి పురస్కార గ్రహీత, కార్యదర్శి డాక్టర్ అంపశయ్య నవీన్ గుర్తుచేశారు.
జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్న వరంగల్ శ్రీనివాస్, ఫన్స్టార్ శివారెడ్డి, నేరెళ్ల వేణుమాధవ్ కల్చరల్ ట్రస్ట్ సభ్యులు
అనంతరం మిమిక్రీతో మంత్రమూగ్ధులిను చేశారు ఫన్స్టార్ శివారెడ్డి. ప్రముఖ సినీహీరోలు, రాజకీయనాయకులు, ప్రముఖుల మిమిక్రీతో అందర్నీ ఆయన కడుపుబ్బా నవ్వించారు. ఆ తర్వాత నేరెళ్ల వేణుమాధవ్ శిష్యులు, ప్రముఖ మిమిక్రీ కళాకారుల ధ్వన్యనుకరణతో అందరినీ అలరించారు. ఈ కార్యక్రమాంలో ప్రముఖ గాయకుడు వరంగల్ శ్రీనివాస్, ప్రముఖ సినీ, మిమిక్రీ కళాకారుడు శివారెడ్డి, జబర్దస్త్ రాకింగ్ రాకేష్, నేరెళ్ల వేణుమాధవ్ ట్రస్ట్ సభ్యులు నేరెళ్ల శోభావతి, నేరేళ్ల శ్రీనాథ్, నేరెళ్ల రాధాకృష్ణ, సలహా మండలి సభ్యులు డాక్టర్ గిరిజ మనోహర్ బాబు, వనం లక్ష్మీకాంతరావు, కొనతం కృష్ణ, పొట్లపల్లి శ్రీనివాసరావు పాల్గొన్నారు.
మిమిక్రీ కళాకారులు అంజన్‌కుమార్, రాజ్‌కుమార్, దామోదర్, రాజు, మక్సూద్, పరషరాము, సదాశివ, కిరణ్, మనోహర్, హన్మంతరావు, శ్రీను, వేణు, శ్రీనిఆస్, రహెమాన్, పరమేశ్, నారాయణ, జంగోజీ, శ్రీధర్, భాస్కర్, బాబర్, రామస్వామి, స్వామి, సత్యం, కృష్ణ, సుబ్రహ్మణ్యం, సాంబశివుడు, ఇందిర, నిజామాబాద్ శంకర్, బాబుమియా, మధు పాల్గొన్నారు.